ఢిల్లీలో జనాభా భారీ పెరుగుదల.. 15 ఏళ్లలో 37 వృద్ధి నమోదు
Actor ProfileCelebrity

ఢిల్లీలో జనాభా భారీ పెరుగుదల.. 15 ఏళ్లలో 37 వృద్ధి నమోదు

Total News1
Movie Updates0
Sources1
ఢిల్లీలో జనాభా భారీ పెరుగుదల.. 15 ఏళ్లలో 37 వృద్ధి నమోదు
Vaartha16 Jun 2026
ఢిల్లీలో జనాభా భారీ పెరుగుదల.. 15 ఏళ్లలో 37 వృద్ధి నమోదు

Delhi Population: దేశ రాజధాని ఢిల్లీ జనాభా గణనీయంగా పెరిగినట్లు సెన్సస్ 2027 తొలి దశలో తేలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం జనాభా 2.3 కోట్లకు పైగా చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇది గత జనగణనతో పోలిస్తే భారీ వృద్ధిగా గుర్తించారు. 2011 జనగణన ప్రకారం ఢిల్లీ జనాభా సుమారు 1.7 కోట్లుగా ఉండగా, గత 15 ఏళ్లలో దాదాపు 37.5 శాతం పెరుగుదల నమోదైనట్లు ఈ ప్రాథమిక గణాంకాలు సూచిస్తున్నాయి. Read also: Modi : అల్లు అర్జున్ క్రేజ్ ను వాడుకున్న మోడీ సెన్సస్ 2027లో భాగంగా చేపట్టిన హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ మొదటి దశ ఏప్రిల్ 1 నుంచి జూన్ 14 వరకు కొనసాగింది. ఈ సమయంలో అధికారులు 45,863 బ్లాకులను కవర్ చేసి, సుమారు 76 లక్షల ఇళ్లు మరియు 55 లక్షల కుటుంబాల వివరాలను సేకరించారు. ఈ గణాంకాలు ఇప్పటికీ ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్న రెండో దశ జనాభా లెక్కింపు తర్వాతే తుది సంఖ్యను ఖరారు చేస్తారని తెలిపారు. ఆ దశలో ప్రజల సామాజిక, ఆర్థిక వివరాలను కూడా సేకరించనున్నారు. ప్రాథమిక లెక్కల ప్రకారం ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా సుమారు 28 లక్షల మంది నివసిస్తుండగా, నైరుతి ఢిల్లీలో 25 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా. న్యూఢిల్లీ జిల్లాలో మాత్రం అత్యల్పంగా సుమారు 2 లక్షల జనాభా నమోదైంది. 2026 మధ్య నాటికి ఢిల్లీ జనాభా 2.3 కోట్లకు చేరుతుందని గత అంచనాలు పేర్కొన్నాయి. తాజా సెన్సస్ తొలి దశ ఫలితాలు ఆ అంచనాలకు చాలా దగ్గరగా ఉండటం గమనార్హం. Rayapati Shailaja: అనితపై వ్యాఖ్యలు.. గుడివాడ అమర్‌నాథ్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన