ఢిల్లీకి తృణమూల్ పంచాయతీ..! అభిషేక్ వర్సెస్ రెబెల్స్
Actor ProfilePolitician

ఢిల్లీకి తృణమూల్ పంచాయతీ..! అభిషేక్ వర్సెస్ రెబెల్స్

Total News3
Movie Updates0
Sources1
సోషల్ మీడియాలో తెలిసింది-టీఎంసీ రెబెల్స్ విలీనంపై ఆ పార్టీ బాస్
Oneindia Telugu15 Jun 2026
సోషల్ మీడియాలో తెలిసింది-టీఎంసీ రెబెల్స్ విలీనంపై ఆ పార్టీ బాస్

పశ్చిమబెంగాల్లో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) నుంచి విడిపోయిన 20 మంది రెబెల్ ఎంపీలు వేరు కుంపటి పెట్టుకున్నారు. తాజాగా వీరు లోక్ సభ స్పీకర్

ఊహించని పార్టీలోకి టీఎంసీ రెబెల్స్ విలీనం- స్పీకర్ కు లేఖ
Oneindia Telugu14 Jun 2026
ఊహించని పార్టీలోకి టీఎంసీ రెబెల్స్ విలీనం- స్పీకర్ కు లేఖ

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్లమెంటరీ పార్టీలో మొదలైన తిరుగుబాటు పర్వం ఇవాళ కీలక మలుపు తీసుకుంది. సీనియర్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో పార్టీకి చెందిన 20

ఢిల్లీకి తృణమూల్ పంచాయతీ..! అభిషేక్ వర్సెస్ రెబెల్స్
Oneindia Telugu14 Jun 2026
ఢిల్లీకి తృణమూల్ పంచాయతీ..! అభిషేక్ వర్సెస్ రెబెల్స్

బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత విపక్ష తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో తలెత్తిన తిరుగుబాటు ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇప్పటికే అసెంబ్లీలో మమతా బెనర్జీ సూచించిన ఎమ్మెల్యే శోభన్ దేవ్ ఛటర్జీకి కాకుండా ఆమె పార్టీ నుంచి బహిష్కరించిన రితబ్రత బెనర్జీకి విపక్ష నేత పదవిని స్పీకర్ కట్టబెట్టారు. ఇప్పుడు లోక్ సభలోనూ ఎంపీలు చీలిపోయి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ లో విలీనం దిశగా పిల్ల కాంగ్రెస్ లు..! జగన్ వైఖరి మారుతోందా ?తృణమూల్ కాంగ్రెస్ తరఫున గత ఎన్నికల్లో 28 మంది ఎంపీలు గెలిచారు. వీరిలో దాదాపు 22 మంది ఎంపీలు రెబెల్స్ గా మారిపోయారు. వీరంతా ఎన్డీయేకు మద్దతుగా ఉంటామని, తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని లోక్ సభ స్పీకర్ ను ఇవాళ కోరారు. సీనియర్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో వీరంతా ఢిల్లీలో బీజేపీ నేతల్ని కలిసిన తర్వాత స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. తమను లోక్ సభలో ప్రత్యేక వర్గంగా గుర్తించాలని వీరు స్పీకర్ కు లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ వీరి దూకుడును అడ్డుకునేందుకు తుది ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆయన స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎంపీల్ని ప్రత్యేక వర్గంగా గుర్తించవద్దని కోరారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అలా గుర్తించే వీలు లేదని, ఏదైనా పార్టీలో విలీనం కాకుండా వీరిని ప్రత్యేక వర్గంగా గుర్తించరాదని తెలిపారు. మమత కోసం ఎంపీ పదవికి పఠాన్ రాజీనామా ? లాబీయింగ్ పై గంగూలీ క్లారిటీ..!