డిసెంబర్’ సెంటిమెంట్ ను నమ్ముకున్న ప్రభాస్.. ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
Actor ProfilePolitician

డిసెంబర్’ సెంటిమెంట్ ను నమ్ముకున్న ప్రభాస్.. ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డిసెంబర్’ సెంటిమెంట్ ను నమ్ముకున్న ప్రభాస్.. ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
Samayam Telugu12 Aug 2026
డిసెంబర్’ సెంటిమెంట్ ను నమ్ముకున్న ప్రభాస్.. ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

**‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్యాక్ టు బ్యాక్ గ్లోబల్ బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘రాజాసాబ్’ చిత్రంతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. అయితే ఆ పరాజయాన్ని పక్కన పెట్టి, ప్రస్తుతం ఆయన ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘ఫౌజీ’ వంటి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ ఇప్పటికే అప్‌డేట్లతో దూసుకుపోతుండగా, తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రం కూడా తన విడుదల తేదీని ఖరారు చేసుకున్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ ఏడాదిలో ఇప్పటికే సగం కాలం గడిచిపోయినప్పటికీ, టాలీవుడ్‌లో వేళ్లమీద లెక్కించదగ్గ చిత్రాలు మాత్రమే ఘనవిజయం సాధించాయి. దీంతో థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టే గట్టి కంటెంట్ ఉన్న సినిమా కోసం ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. ‘సీతారామం’ వంటి క్లాసిక్ హిట్ అందించిన హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు కావడం, స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే పీరియాడిక్ వార్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ కథ రూపొందడం వల్ల ‘ఫౌజీ’పై టాలీవుడ్‌లో మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.* నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న స్టార్ ప్రొడ్యూసర్.. ఎస్‌కేఎన్ సరికొత్త ప్రయాణం!డిసెంబర్ సెంటిమెంట్‌ నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులోనే విడుదల చేయాలని చిత్ర బృందం తొలుత భావించింది. కానీ భారీ యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా అక్టోబర్ లేదా నవంబర్‌కు వాయిదా పడవచ్చని ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, మేకర్స్ ఎట్టకేలకూ డిసెంబర్ 3ను వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్‌గా లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. సినీ పరిశ్రమలో డిసెంబర్ నెలకు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. గత కొన్నేళ్లలో చూసుకుంటే.. ‘అఖండ’, ‘పుష్ప: ది