డెలివరీ బాయ్ తో గొడవ.. అఖిల్ రాజ్ వాదన ఏంటి
Actor ProfileActor

డెలివరీ బాయ్ తో గొడవ.. అఖిల్ రాజ్ వాదన ఏంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డెలివరీ బాయ్ తో గొడవ.. అఖిల్ రాజ్ వాదన ఏంటి
Chitrajyothy21 Aug 2026
డెలివరీ బాయ్ తో గొడవ.. అఖిల్ రాజ్ వాదన ఏంటి

సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న వీడియో క్లిప్ దొరికితే చాలు.. క్షణాల్లో జడ్జ్‌మెంట్లు ఇచ్చేయడం, ఒకరిని పూర్తిగా విలన్‌గా మార్చేయడం అలవాటుగా మారిపోయింది. గత రాత్రి నుంచి రాజు వెడ్స్ రాంభాయి ఫేమ్ అఖిల్ రాజ్ (Akhil Raj) కి, ఒక డెలివరీ బాయ్‌కు మధ్య జరిగిన వివాదంలో కూడా ఇదే జరుగిందని కొందరు చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న వీడియో క్లిప్ దొరికితే చాలు.. క్షణాల్లో జడ్జ్‌మెంట్లు ఇచ్చేయడం, ఒకరిని పూర్తిగా విలన్‌గా మార్చేయడం అలవాటుగా మారిపోయింది. గత రాత్రి నుంచి రాజు వెడ్స్ రాంభాయి ఫేమ్ అఖిల్ రాజ్ (Akhil Raj) కి, ఒక డెలివరీ బాయ్‌కు మధ్య జరిగిన వివాదంలో కూడా ఇదే జరుగిందని కొందరు చెప్పుకొస్తున్నారు. తప్పు పార్శిల్ తీసుకువచ్చాడని ఆగ్రహంతో అఖిల్.. డెలివరీ బాయ్ పై దాడి చేసినట్లు ఒక వీడియొ వైరల్ గా మారింది. ఇక వైరల్ అవుతున్న కొన్ని సెకన్ల వీడియోను చూసి అఖిల్ రాజ్‌దే తప్పు అని సోషల్ మీడియా కోర్టులు తీర్పులు ఇచ్చేస్తున్నాయి. కానీ, ప్రతి గొడవ వెనుక రెండు వైపుల కథలు ఉంటాయనే కనీస సత్యాన్ని చాలామంది మర్చిపోతున్నారు. అసలు గొడవకు ముందు ఏం జరిగింది? అఖిల్ రాజ్ వెర్షన్ ఏంటి? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయడం లేదని పలువురు తమ అభిప్రయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అసలు ఈ వివాదం వెనుక అసలు కథ వేరే ఉంది. అఖిల్ రాజ్ ఇంటికి ఒక తప్పు పార్సిల్ డెలివరీ అయ్యింది. అది తమదేనని భావించి ఆయన తల్లి ఆ పార్సిల్‌ను ఓపెన్ చేశారు. అయితే, సుమారు 20 నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన డెలివరీ బాయ్.. అది వేరే వాళ్ల పార్సిల్ అని, వెనక్కి ఇచ్చేయాలని కోరాడు. అప్పటికే పార్సిల్ తెరిచి ఉండటాన్ని చూసి, సదరు డెలివరీ బాయ్ అఖిల్ రాజ్ తల్లితో ఎంతో రఫ్‌గా