డిమాంటి కాలనీ
Actor ProfileActor

డిమాంటి కాలనీ

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
డిమాంటి కాలనీ-3’.. రిలీజ్ డేట్ వ చ్చేసింది
Chitrajyothy24 Jul 2026
డిమాంటి కాలనీ-3’.. రిలీజ్ డేట్ వ చ్చేసింది

హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ప్ర‌త్యేక‌మైన పేరు లిఖించుకున్న త‌మిళ చిత్రం డిమాంటే కాల‌నీ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ప్ర‌త్యేక‌మైన పేరు లిఖించుకున్న త‌మిళ చిత్రం డిమాంటే కాల‌నీ (Demonte Colony) అరుళ్‌నిధి హీరో. ఇప్ప‌టికే రెండు భాగాలుగా వ‌చ్చిన ఈ చిత్రాలు ఒక‌దానిని మించి మ‌రోటి సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ మూవీకి సీక్వెల్ మూడ‌వ భాగాన్ని ‘డిమాంటి కాలనీ-3’ (Demonte Colony 3: The End Is Too Far Away) సైతం తెర‌కెక్కించ‌గా ఇప్పుడు విడుద‌ల‌కు ముస్తాబ‌వుతుంది. గ‌త రెండు సినిమాల‌ను డైరెక్ట్ చేసిన‌ అజయ్‌ ఙ్ఞానముత్తు (Ajay Gnanamuthu) కథను సమకూర్చి దర్శకత్వం వహించారు. ఫ్యాషన్‌ స్టూడియోస్‌ అధినేత సుధన్‌ సుందరంతో కలిసి మనీష్‌ సింఘాల్‌, దుర్గా రామ్‌ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ అభిమానులతో పాటు చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబరు 11వ తేదీనవిడుదల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.ఈ సంద‌ర్భంగా నిర్మాతల్లో ఒకరైన సుధన్‌ సుందరం మాట్లాడుతూ, ‘ఈ సిరీస్‌లో తొలి రెండు భాగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాయి. ఒక సినిమాకు సీక్వెల్‌ తీయడం అంత ఈజీ కాదు. కానీ, ‘డిమాంటి కాలనీ’లో దర్శకుడు దాని సాధ్యం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం దర్శకుడు, హీరో ఎంతో బాధ్యత, అంకిత భావంతో పని చేసి, సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళారు. త్వరలోనే ప్రమోషన్‌, మార్కెటింగ్‌ పనులను ప్రారంభిస్తాం’’ అని వివరించారు. కాగా, ఈ చిత్రంలో అరుళ్‌నిధి (Arulnithi)తో పాటు ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), గురు సోమసుందరం (Guru Somasundaram ), జీఎం కుమార్‌, ముత్తుకుమార్‌, శ్రీకుమార్‌, మీనాక్షి గోవిందరాజన్‌, కదిర్‌, అర్చన రవిచంద్రన్‌ తదితరులు నటించారు

ప్లీజ్ ... కులం పేరు వాడొద్దు - హీరో
Chitrajyothy18 Jun 2026
ప్లీజ్ ... కులం పేరు వాడొద్దు - హీరో

తన పేరు వెనుక ఉండే ‘రెడ్డి’ అనే కులం పేరును జోడించి పిలవొద్దని, రాయొద్దని హీరో సనంత్‌ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హార్టిన్‌’ వేడుకలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. తన పేరు