
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నియామకాన్ని, అలాగే ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) కర్ణాటక హైకోర్టు మంగళవారం తీవ్రంగా పరిగణించి కొట్టేసింది. ఈ పిటిషన్ వెనుక ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని, ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానం విలువైన సమయాన్ని వృథా చేసినందుకు గానూ పిటిషన్ వేసిన హుబ్బళ్లి నివాసి మంగళప్ప అనే వ్యక్తికి రూ.50,000 జరిమానా విధిస్తూ రెండు వారాల్లోగా ఈ మొత్తాన్ని 'కర్ణాటక రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ'కి చెల్లించాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ విభూ బాఖ్రూ, జస్టిస్ కేఎస్ హిమలేఖలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది హునుమంత్ కుమార్.. కేసు బలాన్ని గమనించి పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని న్యాయస్థానాన్నికోరారు. అయితే దీనికి ప్రధాన న్యాయమూర్తి నిరాకరిస్తూ.. "ఇలాంటి అర్థరహితమైన పిటిషన్లు వేసినందుకు మీరు ఖచ్చితంగా జరిమానా కట్టాల్సిందే.. పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు" అని గట్టిగా హెచ్చరించారు. కేవలం వార్తల్లో నిలవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి పిటిషన్లు వేస్తున్నారని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ సమయంలో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామంటే సరిపోదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.పిల్ అనే పవిత్రమైన వేదికను దుర్వినియోగం చేయడాన్ని న్యాయవ్యవస్థ ఎంతమాత్రం సహించబోదని కోర్టు హెచ్చరించింది. సరైన ఆధారాలు, బలమైన కారణాలు లేకుండా కోర్టులకు వచ్చి సమయాన్ని వృథా చేసే ఇలాంటి పిటిషన్లపై భవిష్యత్తులోనూ కఠినంగా వ్యవహరిస్తామని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అసలు పిటిషనర్ వాదన ఏమిటంటే.. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1A) ప్రకారం, మంత్రిమండలిలో కనీసం 24 మంది నుంచి గరిష్టంగా 33 మంది సభ్యులు ఉండాలి. కానీ డీకే శివకుమార్‌తో కేవలం 13 మంది (మొత్తం 14 మంది) మాత్రమే ప్రమాణ స్వీకారం