టీ స్టాల్ లో రూ.40 కోసం ఐపీఎస్ గా అవతారం... కటకటాల్లోకి నిందితుడు
Actor ProfilePolitician

టీ స్టాల్ లో రూ.40 కోసం ఐపీఎస్ గా అవతారం... కటకటాల్లోకి నిందితుడు

Total News1
Movie Updates0
Sources1
టీ స్టాల్ లో రూ.40 కోసం ఐపీఎస్ గా అవతారం... కటకటాల్లోకి నిందితుడు
AP7AM16 Jun 2026
టీ స్టాల్ లో రూ.40 కోసం ఐపీఎస్ గా అవతారం... కటకటాల్లోకి నిందితుడు

తాను ఐపీఎస్ అధికారిని అంటూ లక్నోలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. కేవలం రూ.40 విలువైన బన్ ప్యాకెట్ బిల్లు చెల్లించకుండా గొడవకు దిగడమే కాకుండా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది తనకు సెల్యూట్ చేయాలని డిమాండ్ చేయడంతో అతని అసలు స్వరూపం బయటపడింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.పూర్తి వివరాల్లోకి వెళితే, నోయిడాకు చెందిన మిథిలేష్ శుక్లా అనే ప్రైవేట్ ఉద్యోగి జూన్ 13 రాత్రి లక్నోలోని మహానగర్ ప్రాంతంలో ఉన్న ఒక టీ స్టాల్ వద్ద బన్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. అయితే, దానికి సంబంధించిన డబ్బులు చెల్లించకుండా వెళ్ళిపోతుండటంతో, దుకాణ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో తాను నోయిడాలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారిని అంటూ మిథిలేష్ బుకాయించాడు.కనీస మర్యాద లేకుండా తనను ప్రశ్నిస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, తనకు సెల్యూట్ చేయాలని పట్టుబట్టాడు. అయితే, యూనిఫాం ధరించకుండా, గుర్తింపు కార్డు చూపకుండా సెల్యూట్ చేసే ప్రసక్తే లేదని అక్కడి కానిస్టేబుల్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, అతనికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అడిగిన వివరాలకు ఎటువంటి ఆధారాలు చూపించలేకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ అధికారిగా చలామణి అవ్వడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. నకిలీ అధికారిని ధైర్యంగా ఎదుర్కొన్న పోలీసుల తీరుపై