టాస్ గెలిచిన టీమిండియా.. వైభవ్ కు దక్కని చోటు
Actor ProfileActor

టాస్ గెలిచిన టీమిండియా.. వైభవ్ కు దక్కని చోటు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాస్ గెలిచిన టీమిండియా.. వైభవ్ కు దక్కని చోటు
Sakshi27 Jul 2026
టాస్ గెలిచిన టీమిండియా.. వైభవ్ కు దక్కని చోటు

బెల్‌ఫాస్ట్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత్, ఐర్లాండ్ తలపడుతున్నాయి. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 8 టీ20 మ్యాచ్‌లు జరిగితే అన్నింటిలోనూ టీమిండియానే విజయం సాధించడం విశేషం. టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కలేదు. టైం వచ్చినప్పుడు వైభవ్‌ జట్టులోకి వస్తాడని కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు. తుది జట్లు టీమిండియా: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్, ప్రసిద్ధ కృష్ణ ఐర్లాండ్‌: టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(వి/సి), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై మూండ్రా, మాథ్యూ హోలార్డ్ టీ20 ప్రపంచకప్‌లో రెండోసారి విజేతగా నిలిచిన తర్వాత భారత జట్టు తమ తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌కు సిద్ధమైంది. వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులోనే లేని శ్రేయస్‌ అయ్యర్‌... ఐపీఎల్‌లో కనబర్చిన నాయకత్వ ప్రదర్శనతో ఇప్పుడు తొలిసారి భారత టి20 జట్టుకు సారథిగా బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు గతంలో రెండు మ్యాచ్‌లలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన లోర్కాన్‌ టకర్‌ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఐర్లాండ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్ అంటే ఫలితం గురించి ఆలోచించాల్సిన అసవరం కూడా లేదు. సంజూ సామ్సన్, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ల విధ్వంసకర ఆటపై కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఐర్లాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. దానికి ఒకే ఒక్కడు కారణం. 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ భారత సీనియర్‌ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తాడా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. థాయ్‌ల్యాండ్ బీచ్ వెకేషన్‌లో సినిమా జంట (ఫొటోలు) సూపర్‌స్టార్ మూవీ లాంచ్ కోసం రాశీఖన్నా