
హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన నూతన చిత్రం ‘దీవాన’. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ల పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో నిర్మాతలు, దర్శకుడు.. సెన్సార్ విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్షిత్ రెడ్డి (Harshith Reddy) హీరోగా నటించిన నూతన చిత్రం ‘దీవాన’ (Deewana). అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ల పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి (Director Sreekanth Sangishetty) టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయయ్యారు. ఈ నెల 20న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెన్సార్ టీమ్‌పై, సెన్సార్ విధానంపై చిత్రబృందం ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ.. అందరూ మంచి సినిమా చేశారంటూ అప్రిషియేట్ చేస్తున్న ఫోన్ కాల్స్ ఆగడం లేదు. మరోవైపు మా సినిమాను ఇంకాస్త ఆడియెన్స్ లోకి తీసుకెళ్తే బాగుండేదని అనిపిస్తోంది. మేము రిలీజ్‌కు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో టూర్స్ ప్లాన్ చేశాం. కానీ, సెన్సార్ సర్టిఫికేషన్ వల్ల అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నాం. మా సినిమాలో ముద్దు సీన్స్ లేవు, వయలెంట్ సీన్స్ లేవు. అయినా ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మాలాంటి యంగ్ టీమ్‌కు ఒక ఛాన్స్ ఇవ్వమని ప్రేక్షకుల్ని కోరుతున్నాను. మీకు మా సినిమా నచ్చకుంటే డబ్బులు రిటర్న్ ఇస్తాం. సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధర 100 రూపాయలు చేస్తున్నాం. మల్టీప్లెక్స్ ల్లో కూడా ఒక రేట్ ప్రకటిస్తాం. ప్రేక్షకులందరి దగ్గరకు వచ్చి మా సినిమాను మరోసారి రీచ్ చేయాలని అనుకుంటున్నామని తెలిపారు. మరో నిర్మాత శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ.. మా సినిమాకు ప్రీమియర్స్ పడినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ సినిమా చాలా