
తెలుగు చలనచిత్ర పరిశ్రమ రేంజ్ ఇప్పుడు కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే రేంజ్‌కు టాలీవుడ్ ఎదిగింది. ఈ క్రమంలోనే రాబోయే కాలంలో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసేందుకు అత్యంత భారీ బడ్జెట్, హై-వోల్టేజ్ క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ముఖ్యంగా రాబోయే కాలంలో థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్న కొన్ని మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రాలు వాటిపై ఉన్న భారీ అంచనాల విశేషాలు ఇవే.. ఫౌజీ : రెబల్ స్టార్ ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న పీరియడ్ ఆర్మీ యాక్షన్ డ్రామా ఫౌజీ. 1940ల నాటి బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో ఆజాద్ హింద్ ఫౌజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగనుంది. ప్రభాస్ లుక్, హను మార్క్ ఎమోషన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. స్పిరిట్ : ‘యానిమల్’ చిత్రంతో బాక్సాఫీస్‌ను వణకించిన సాండీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబోలో రాబోతున్న రికార్డ్ బ్రేకింగ్ ప్రాజెక్ట్. ఇందులో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ అండ్ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. సందీప్ మార్క్ వైల్డ్ యాక్షన్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారణాసి : టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో గ్లోబల్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం. దాదాపు రూ. 1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోందని టాక్. డ్రాగన్ పార్ట్ 1 : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న బ్లడ్ సోక్డ్ యాక్షన్ సాగా డ్రాగన్. ఉగ్రం, కేజీఎఫ్, సలార్ లాంటి హై-వోల్టేజ్ ఎలివేషన్లతో మతిపోగొట్టే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌ను ఏ రేంజ్ డ్రాగన్‌లా చూపించబోతున్నాడో అని మాస్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. రాకా & ఓజీ 2 : అల్లు