ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ మూవీ రివ్యూ.. వడ్డే నవీన్ కమ్ బ్యాక్ వర్కవుట్ అయిందా
Actor ProfilePolitician

ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ మూవీ రివ్యూ.. వడ్డే నవీన్ కమ్ బ్యాక్ వర్కవుట్ అయిందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ మూవీ రివ్యూ.. వడ్డే నవీన్ కమ్ బ్యాక్ వర్కవుట్ అయిందా
TV9 Telugu19 Jun 2026
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ మూవీ రివ్యూ.. వడ్డే నవీన్ కమ్ బ్యాక్ వర్కవుట్ అయిందా

నటీనటులు: వడ్డే నవీన్, రాశీ సింగ్, శిల్ప తులస్కర్‌, దేవి ప్రసాద్‌, వివేక్ రఘువంశీ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని తదితరులు త్రిమూర్తులు (వడ్డే నవీన్) నిజాయితీకి మారుపేరు లాంటి కానిస్టేబుల్. ఆ నిజాయితీ వల్లే అతనికి తరచూ బదిలీలు అవుతుంటాయి. అందుకే అతన్ని ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అని పిలుస్తుంటారు. త్రిమూర్తులు పనిచేసే ఏరియాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కమల (శిల్ప తులస్కర్) కొడుకు సంతోష్ బాబు (వివేక్ రఘువంశీ)ఎన్నికల్లో పోటీ చేస్తుంటాడు. జనాల సానుభూతి కోసం సీఎం తనపై తానే దాడి జరిగినట్లు ఒక నాటకం ఆడుతుంది. దాన్ని త్రిమూర్తులు ఫెయిల్ చేస్తాడు. దాంతో కోపం వచ్చిన సీఎం, అతన్ని వేరే పాత పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తుంది. అక్కడ పని లేకపోవడంతో పాత ఫైల్స్ చూస్తున్న త్రిమూర్తులుకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. తన తండ్రి (దేవి ప్రసాద్) చనిపోయిన రోజు రాసిన ఒక ఎఫ్.ఐ.ఆర్ కాపీ దొరుకుతుంది. సీఎం కొడుకు ప్రియమ్మ అనే గిరిజన అమ్మాయిపై చేసిన లైంగిక దాడికి సంబంధించిన కేసది. కానీ దానికి సంబంధించి తప్పుదోవ పట్టించేలా వేరే కాపీలు కూడా ఉండటంతో హీరో ఎంక్వైరీ మొదలుపెడతాడు. ఈ దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? సీఎం అసలు రంగు ఎలా బయటపడింది? ఈ కేసును త్రిమూర్తులు ఎలా డీల్ చేశాడు? అనేదే మిగతా కథ. నిజాయితీ గల పోలీసు, ఒక రాజకీయ నాయకురాలి కొడుకు చేసిన అకృత్యాలను బయటపెట్టడం అనేది కొత్త ఫార్ములా కాదు. కానీ దాన్ని పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేస్తే మాత్రం బాగానే వర్కవుట్ అవుతుంది. ముఖ్యంగా రాజకీయాల చుట్టూ తిరిగే కథలకు డిమాండ్ ఎప్పుడూ బాగానే ఉంటుంది. ఇప్పుడు కొత్త దర్శకుడు కమల్ తేజ కూడా ఇదే చేసాడేమో అనిపించింది. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు కథ అంతా రాజకీయాల చుట్టూనే తిప్పాడు. పొలిటికల్ లీడర్స్ తప్పులు చేయడం, హీరో వారి ఆట కట్టించడం లాంటి రొటీన్ కథను