ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ
Actor ProfilePolitician

ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు' మూవీ రివ్యూ
AP7AM19 Jun 2026
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు' మూవీ రివ్యూ

వడ్డే నవీన్‌ ఈ పేరు వినగానే అందరికి పెళ్లి, మనసిచ్చిచూడు, చాలా బాగుంది లాంటి సక్సెస్ ఫుల్‌ చిత్రాలు గుర్తొస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన ఈ కథానాయకుడు చాలా కాలం విరామం తరువాత 'ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు'తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. తను హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక వడ్డే నవీన్‌ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ చిత్ర కథేంటి? ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా రివ్యూలో తెలుసుకుందాం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన త్రిమూర్తులు (వడ్డే నవీన్‌) కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేడు. నీతి నీజాయితితో ఉద్యోగం చేస్తుండటంతో ఎక్కడ కూడా పట్టుమని మూడు నాలుగు నెలలు నికరంగా ఉద్యోగం చేసే అవకాశం ఉండదు. దాదాపు 55 సార్లు రకరకాల ఊర్లకు ట్రాన్స్‌ ఫర్‌ అవుతూ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులుగా పేరు తెచ్చుకుంటాడు. ఓ సారి అమలాపురం నుంచి అరకులో తన తండ్రి పనిచేసిన పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అవుతాడు. ఈ పోలీస్‌స్టేషన్‌లో అనుకోకుండా గిరిజన అమ్మాయి ప్రియమ్మ అత్యాచారంకు సంబంధించిన కంప్లయిట్‌ కాపీ, ఎఫ్‌ఐఆర్‌ కాపీలు, ఇందుకు సంబంధించిన ఓ ఫైల్‌ దొరుకుతుంది. ఈ కేసులోనే అత్యంత నిజాయితీగా ఉన్న తన తండ్రి శ్రీనివాసులు (దేవి శ్రీ ప్రసాద్) ప్రాణాలు కూడా కోల్పోతాడు. అయితే ఈ అత్యాచారం ఘటనకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కమలమ్మ (శిల్పా శిలస్కర్‌), ఆమె తనయుడు కాబోయే సీఎం సంతోష్‌ (వివేక్‌ రఘువంశీ) కారణం అని తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైన బాధిత ప్రియమ్మకు న్యాయం చేయాలని, కమలమ్మ, సంతోష్‌లకు కోర్టులో శిక్ష వేయించాలని నిర్ణయించుకుంటాడు. ఇక ఆ తరువాత జరిగిందేమిటి? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కమలమ్మతో ఎలా పోరాడాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? బాధితురాలికి ఎలా న్యాయం చేశాడు అనేది మిగతా కథ. వడ్డే నవీన్‌

ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ, వడ్డే నవీన్ రీ ఎంట్రీ మూవీ ఎలా ఉందంటే
Asianet News Telugu19 Jun 2026
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ, వడ్డే నవీన్ రీ ఎంట్రీ మూవీ ఎలా ఉందంటే

ఒకప్పుడు మంచి లవ్‌ స్టోరీస్‌, ఫ్యామిలీ చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్నాడు వడ్డే నవీన్‌. ఇరవై ఏళ్ల క్రితం స్టార్‌ హీరోగా రాణించాడు. మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలతో ఆయన సినిమాలు తగ్గించారు. ఓ దశలో సినిమాలు చేయడమే మానేశారు. చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు `ట్రాన్స్ ఫర్‌ త్రిమూర్తులు` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్‌ మూవీని నిర్మించడం విశేషం. ఇందులో వడ్డే నవీన్‌ హీరోగా నటించగా, రాశీ సింగ్‌ హీరోయిన్‌గా చేసింది. ప్రమోదిని, బేబీ ఊహా, దేవిప్రసాద్‌, రఘుబాబు,ఆడుకాలం నరేన్‌, శివన్నారయణ, వడ్లమాని శ్రీనివాసరావు వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. కమల్‌ తేజ నార్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(జూన్‌ 19) విడుదలైంది. మరి వడ్డే నవీన్‌ రీఎంట్రీ మూవీ ఎలా ఉంది? ఆయనకు హిట్‌ పడిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. త్రిమూర్తులు(వడ్డే నవీన్‌) నిజాయితీకి మారుపేరు. తన నిజాయితీ వల్ల వరుసగా ట్రాన్స్ ఫర్‌ అవుతుంటారు. దీంతో ఆయన్ని ట్రాన్స్ ఫర్‌ త్రిమూర్తులు అంటారు. తాను పనిచేసే నియోజవర్గంలో సీఎం కొడుకు పోటీ చేస్తుంటాడు. తన కొడుకు కోసం సీఎం కమల(శిల్ప తులస్కర్‌) ప్రచారానికి వస్తుంది. అందులో ప్రత్యర్థి పార్టీల వాళ్లు తనపై దాడి చేసినట్టుగా ప్లాన్‌ చేసి సింపతీ గేమ్‌ ఆడాలని ప్రయత్నిస్తారు. కానీ దాన్ని కానిస్టేబుల్‌ త్రిమూర్తులు అడ్డుకుంటాడు. సీఎం ప్లాన్‌ బెడిసి కొట్టడంతో ఆమె సీరియస్ అవుతుంది. తన చుట్టూ ఇలాంటి నిజాయితీ గల అధికారులు ఉండొద్దని చెబుతుంది. దీంతో త్రిమూర్తులుకి మరోసారి ట్రాన్స్ ఫర్‌ తప్పదు. అయితే ఈ సారి తన నాన్న శ్రీనివాసులు(దేవి ప్రసాద్‌) పనిచేసిన పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తాడు. అయితే అక్కడ తనని ఏ పనిచేయనివ్వరు. ఓ దశలో పాత పోలీస్‌ స్టేషన్‌కి పంపిస్తారు. అక్కడ త్రిమూర్తులు ఖాళీగా కూర్చోలేక పాత ఫైల్స్ వెతుకుతుంటాడు