ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ మూవీని క్వాలిటీతో తీశాం.. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.. వడ్డే నవీన్
Actor ProfileActor

ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ మూవీని క్వాలిటీతో తీశాం.. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.. వడ్డే నవీన్

Total News1
Movie Updates0
Sources1
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ మూవీని క్వాలిటీతో తీశాం.. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.. వడ్డే నవీన్
Telugu Times17 Jun 2026
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ మూవీని క్వాలిటీతో తీశాం.. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.. వడ్డే నవీన్

వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌కి జోడిగా రాశీ సింగ్ నటించారు. ఈ చిత్రాన్ని జూన్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు, దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. *వడ్డే నవీన్ మాట్లాడుతూ* .. ‘‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమాకి టీం అంతా కలిసి ఎంతో ప్యాషన్‌తో పని చేశారు. డబ్బుల కోసం పని చేసినట్టుగా నాకు ఎక్కడా అనిపించలేదు. అందరూ ఇష్టపడి, కష్టపడి పని చేశారు. కేవలం స్క్రిప్ట్ కోసమే కమల్‌ను ఏడాది పాటుగా హింసించాను (నవ్వుతూ). కళ్యాణ్‌ని కూడా మ్యూజిక్ విషయంలో ఇబ్బంది పెట్టాను (నవ్వుతూ). ప్రతీ ఒక్కరూ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డారు. రాశీ సింగ్ గారికి మంచి టాలెంట్ ఉంది. ఆమె ఎప్పుడూ పర్‌ఫెక్షన్ కోసం ట్రై చేస్తుంటారు. ఈ పన్నెండేళ్లలో నేను సినిమాలు చేయకపోయినా అభిమానులు నా మీద ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. ఈ జర్నీలో మీడియా కూడా సపోర్ట్ చేస్తూనే వచ్చింది. సినిమా ఆరంభం నుంచే వేగంగా దూసుకుపోతోంది. క్లైమాక్స్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మంచి క్వాలిటీతో మూవీని తీశాం. థియేటర్‌కు వచ్చి మా సినిమాని చూడండి. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. *కేఎస్ రామారావు మాట్లాడుతూ* .. ‘వడ్డే రమేష్ గారితో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆయన దమ్మున్న నిర్మాత. నవీన్ చేసిన సినిమాల్లో దాదాపు అన్నీ హిట్టే అయ్యాయి. ఇన్నేళ్ల గ్యాప్ ఎందుకు తీసుకున్నారో నాకు తెలీదు. కానీ అప్పుడు చూసినట్టుగానే ఇప్పుడు కూడా కనిపిస్తున్నారు. టీజర్, ట్రైలర్ చాలా రిఫ్రెషింగ్‌గా కనిపించాయి. అందరూ నిజాయితీతో ఎంతో