ట్రాక్ ఒప్పందం కావాలి
Actor ProfilePolitician

ట్రాక్ ఒప్పందం కావాలి

Total News1
Movie Updates0
Sources1
ట్రాక్ ఒప్పందం కావాలి
Sakshi18 Jun 2026
ట్రాక్ ఒప్పందం కావాలి

దశాబ్దాలుగా ‘అమెరికన్‌ డ్రీమ్‌’ భారత యువతను ఆకర్షిస్తోంది. లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్నారు. అక్కడ మంచి ఉద్యోగాలు సాధించి, సాంకేతిక ఆవిష్కరణలతో రెండు దేశాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అయితే, ఈ విజయగాథల వెనుక, కొన్ని విషాదాలూ ఉన్నాయి. మాస్టర్స్‌ డిగ్రీ చేయడానికి వెళ్ళిన తెలుగమ్మాయి ‘స్పందన’ మే 31న ఇల్లినాయిలోని మెట్రో స్టేషన్‌ పైనుండి కిందపడి, తీవ్ర గాయాలవ్వడంతో ఆమె తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. పాస్‌పోర్టు, వీసా, డబ్బు లేకపోవడంతో వేలాది మైళ్ల దూరంలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. భారతీయ విద్యార్థులు తరచుగా – రోడ్డు ప్రమాదాలు, అపార్టుమెంట్లలో అగ్ని ప్రమాదాలకు గురవ్వడం, ఈతకు వెళ్లి మునిగిపోవడం, తీవ్ర అనారోగ్యాలు, హింస, దాడుల బారిన పడటం జరుగుతోంది. ఉన్నత విద్య కోసం పిల్లలను అమెరికా పంపడం అనేది సగటు భారతీయ కుటుంబానికి జీవితకాల పొదుపు, ఆస్తుల అమ్మకం, భారీ విద్యా రుణాల కలబోత. ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయినా, గాయాల పాలైనా– సాకారం కాని భవిష్యత్తు కోసం కుటుంబాలు భారీ అప్పులు తీరుస్తూనే ఉండాల్సి వస్తుంది. అత్యవసర వీసాలు పొందడం, చివరి నిమిషంలో విమాన టిక్కెట్లు కొనడం, విదేశీ ఆసుపత్రుల భారీ బిల్లులు చెల్లించడం అనేది ప్రభుత్వ సహాయం లేకుండా మధ్యతరగతి కుటుంబాలకు అసాధ్యం. బీమాతో ధీమా ఇవ్వాలి! ఈ విద్యార్థులు భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తు న్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం సమగ్ర బీమా విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. ఇలాంటి బీమాకు నిధులు సమకూర్చడం భారం కాదు. భారతీయ ప్రవా సులు ప్రతి ఏటా సుమారు 13 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని భారతదేశానికి పంపుతున్నారు. ఈ బీమా పూల్‌ను సృష్టించడం భారత విదేశీ మారక నిల్వలను పెంచుతున్న ఈ వర్గంపై ప్రభుత్వం పెట్టే చిన్న పెట్టుబడి మాత్రమే. ఈ బీమా పాలసీలో