టీమిండియాతో మ్యాచ్ .. పాకిస్తాన్ కు భారీ షాక్
Actor ProfileCelebrity

టీమిండియాతో మ్యాచ్ .. పాకిస్తాన్ కు భారీ షాక్

Total News1
Movie Updates0
Sources1
టీమిండియాతో మ్యాచ్ .. పాకిస్తాన్ కు భారీ షాక్
Sakshi14 Jun 2026
టీమిండియాతో మ్యాచ్ .. పాకిస్తాన్ కు భారీ షాక్

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ద‌మైంది. ఆదివారం ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా గ్రూపు-ఎ మ్యాచ్‌లో భాగంగా భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు పాక్ టీమ్‌కు భారీ షాక్ త‌గిలింది. శ‌నివారం ప్రాక్టీస్ సెష‌న్‌లో ఆ జ‌ట్టు కెప్టెన్ ఫాతిమా సనా గాయ‌ప‌డింది. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా, యువ బ్యాట‌ర్ ఆయేషా జాఫ‌ర్ కొట్టిన షాట్ నేరుగా ఫాతిమా సనా కుడి మోకాలికి త‌గిలింది. దీంతో ఆమె తీవ్ర‌మైన నొప్పితో విలవిల్లాడింది. వెంట‌నే ఫిజియో వ‌చ్చి స‌నాకు చికిత్స అందించాడు. ఆ త‌ర్వాత ఆమె నెట్స్ నుంచి వెళ్లిపోయింది. ఫాతిమా తిరిగి ప్రాక్టీస్‌కు రాలేదు. కానీ దాదాపు గంట త‌ర్వాత ఫాతిమా అటు ఇటు న‌డుస్తూ మైదానంలో క‌నిపించింది. అయితే ప్రీ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న ఫాతిమా స‌నాకు త‌న గాయం గురుంచి విలేకరులు ప్ర‌శ్నించారు. "ఇది అనుకోకుండా జ‌రిగిన సంఘ‌ట‌న మాత్ర‌మే. ఆయేషా ఆడిన షాట్ నా మోకాలికి తగిలింది. ఇప్పుడు కొంచెం నొప్పి త‌గ్గింది. రేపటికల్లా పూర్తిగా కోలుకుంటానని ఆశిస్తున్నాను" అని ఫాతిమా పేర్కొంది. ఒక‌వేళ భార‌త్‌తో మ్యాచ్‌కు ఫాతిమా దూర‌మైతే వికెట్ కీప‌ర్‌ మునీబా అలీ జ‌ట్టును న‌డిపించే అవ‌కాశ‌ముంది. కాగా టీ20ల్లో భార‌త్‌పై పాక్ అంత‌మంచి రికార్డు లేదు. భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 16 సార్లు తలపడ్డాయి. భారత్‌ 16 మ్యాచ్‌లు విజయం సాధించగా.. పాక్‌ కేవలం మూడింట మాత్రమే గెలుపొందింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్‌ 'మహిళల ఆసియా కప్ 2024'లో జరిగింది. ఇప్పుడు ఫాతిమా కూడా జ‌ట్టులో లేక‌పోతే పాక్‌కు పూర్తిగా గెలిచే అవ‌కాశ‌మే ఉండ‌దు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 నుంచి పాక్ జ‌ట్టులో ఫాతిమా కీల‌క ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతోంది. చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు) పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్