
అఫ్గానిస్తాన్‌తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసి మంచి జోష్‌లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్-2026లో ఎడమ కాలి గాయం బారిన పడిన వరుణ్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (BCCI COE)లో కోలుకుంటున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. అయితే వరుణ్ చక్రవర్తి రీప్లేస్‌మెంట్‌ను ఇంకా భారత క్రికెట్ బోర్డు ప్రకటించలేదు. ప్రస్తుత పరిస్థితుల బట్టి చక్రవర్తి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వరుణ్ స్ధానంలో హర్ష్ దూబే లేదా కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసే అవకాశముంది. దూబే అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. కాగా భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ జూన్ 26 నుంచి జరగనుంది. మరోవైపు ఇంగ్లండ్‌తో వన్డేలకు కూడా భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలు తిరిగొచ్చారు. కానీ యశస్వి జైశ్వాల్, సిరాజ్‌కు మాత్రం జట్టులో చోటు దక్కలేదు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అప్‌డేటడ్): శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్-కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ. ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్-కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్
