
మనం వాడే మందులు, తినే ఆహార పదార్ధాలకు ఎక్స్‌పైరీ డేట్ ఉండటం కామన్‌గా చూస్తుంటాం. కానీ, మన ఇంట్లో రాత్రింబవళ్లు నడిచే స్మార్ట్ టీవీకి కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ లేదా లైఫ్ స్పాన్ ఉంటుందని మీకు తెలుసా? కొత్త టీవీ కొనేటప్పుడు మనం బ్రాండ్, ఫీచర్లు, డిస్కౌంట్ల గురించే ఆలోచిస్తాం కానీ, దాని లైఫ్‌స్పాన్ గురించి అస్సలు పట్టించుకోం. అయితే, ప్రతి టీవీకి, ముఖ్యంగా దాని డిస్‌ప్లే ప్యానెల్‌కు ఒక నిర్దిష్టమైన లైఫ్ ఉంటుంది. ఈ విషయంపై 2016లోనే బహిరంగంగా పెద్ద చర్చ నడిచింది. అప్పట్లో ప్రముఖ డిస్‌ప్లే తయారీ సంస్థ 'ఎల్జీ డిస్‌ప్లే' వైస్ ప్రెసిడెంట్ లీ బ్యుంగ్-చుల్ కొరియా మీడియాకు ఒక కీలక సమాచారం ఇచ్చారు. తమ కంపెనీ ఓఎల్‌ఈడీ ప్యానెళ్ల లైఫ్ ను 1 లక్ష గంటలకు పెంచినట్లు ఆయన ప్రకటించారు. అంటే ఆ సమయం దాటిన తర్వాత ఎప్పుడైనా సరే కొత్త టీవీ కొనాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. సాధారణంగా టీవీ కంపెనీలు ఈ ఎక్స్‌పైరీ డేట్ గురించి ఓపెన్‌గా మాట్లాడవు. దీని వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా టీవీ డిస్‌ప్లేలను తయారు చేయడంలో ఎల్జీ డిస్‌ప్లే అత్యంత పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ టీవీలు చాలా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వీటితో పాటు మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లేలు కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. 2016 నాటి రిపోర్టుల ప్రకారం.. ఎల్జీ తన ఓఎల్‌ఈడీ ప్యానెల్ లైఫ్‌ను 1 లక్ష గంటలకు పెంచింది. ఆ సమయంలో నార్మల్ ఎల్‌ఈడీ టీవీల ఆయుష్షు దాదాపు 1 లక్ష గంటలుగా ఉన్నప్పటికీ, ఓఎల్‌ఈడీ టీవీలు ఆ విషయంలో కాస్త తక్కువగా ఉండేవి. ఒక సాధారణ లెక్క ప్రకారం చూసుకుంటే.. ఒక ఇంట్లో రోజుకు సగటున 6 గంటల పాటు టీవీ చూస్తున్నారని అనుకుందాం. అలా అయితే థియరిటికల్‌గా ఆ టీవీ 18 నుండి