టీపీఎస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్
Actor ProfilePolitician

టీపీఎస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్

Total News1
Movie Updates0
Sources1
టీపీఎస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్
Andhra Jyothy17 Jun 2026
టీపీఎస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌‌ఫాస్ట్ చేశారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలతో మాట్లాడారు. రంగారెడ్డి, జూన్ 17: జిల్లాలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను(టీపీఎస్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈరోజు(బుధవారం) ప్రత్యేక హెలికాఫ్టర్‌లో జిల్లాకు చేరుకున్న సీఎం.. హెలిప్యాడ్ నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ వరకు పాఠశాలకు చెందిన బస్సులో ప్రయాణించారు. అనంతరం టీపీఎస్‌ను ప్రారంభించి.. విద్యార్థులతో కలిసి బ్రేక్‌‌ఫాస్ట్ చేశారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలతో మాట్లాడారు. ప్రీ-ప్రైమరీ విభాగాలను సందర్శించారు. పాఠశాల లైబ్రరీ, తరగతి గదులు, ఇన్నోవేషన్ ల్యాబ్, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ల్యాబ్స్‌‌ను సందర్శించిన సీఎం.. అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆవరణలో సీఎం మొక్క నాటారు. డ్యాన్స్, మ్యూజిక్ రూమ్‌ను సందర్శించారు. ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను సందర్శించి విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు సీఎం. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆరుట్లలో బహిరంగ సభ‌ను ఏర్పాటు చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, మండలి చీఫ్‌ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దసరా నాటికి అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్: భూపతిరాజు శ్రీనివాసవర్మ