టీడీపీ ఎంపీ
Actor ProfilePolitician

టీడీపీ ఎంపీ

Total News4
Movie Updates0
Sources4
టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో యువనేత లోకేష్ వీడియో కాన్ఫరెన్స్
Telugu Times17 Jun 2026
టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో యువనేత లోకేష్ వీడియో కాన్ఫరెన్స్

కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే మంత్రి నుంచి బూత్ స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ జనంలోకి వెళ్లాల్సిందే ఈనెల 25నుంచి ఆగస్టు 10వరకు ప్రతిగడపకు వెళ్లి చేసిన మంచిని చెబుదాం సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత నాయకులదే అమరావతి: గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రతిగడపకు వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత పార్టీ కేడర్ పై ఉందని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ… ఈనెల 25నుంచి ఆగస్టు 10వతేదీ వరకు 45రోజులపాటు ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి బూత్ స్థాయి వరకు నాయకులంతా రాష్ట్రంలోని ప్రతిగడపకు వెళ్లి చేసిన మంచిని చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేలా ప్రతి ఇంటికి కరపత్రాలు, బుక్ లెట్లు అందించాలన్నారు. కూటమిలోని జనసేన, బీజేపీ కేడర్ ను కలుపుకొని వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇది అధినేత చంద్రబాబు ఆదేశంగా ఆయన చెప్పారు. చంద్రబాబునాయుడు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, దీంతోపాటు గత రెండేళ్లలో పెద్దఎత్తున చేపట్టిన సంక్షేమాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కేడర్ పై ఉందన్నారు. తల్లికి వందనం, దీపం -2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలండర్లు, దేశంలో మరేరాష్ట్రంలో లేనివిధంగా రూ.4వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఆటో డ్రైవర్ల సేవలో, అన్నదాత సుఖీభవ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని అన్నారు. చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే మనం చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోతుందని తెలిపారు. 2014-19 నడుమ చేసిన మంచిపనులను చెప్పుకోలేకపోవడం, ప్రత్యర్థుల విషప్రచారం వల్లే ఓటమి పాలయ్యామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు మంత్రులు, ఎంపీలు

టీడీపీ ఎంపీ అవినీతిపై ఈడీకి ఫిర్యాదు ? స్వయంగా సోదరుడే
Oneindia Telugu12 Jun 2026
టీడీపీ ఎంపీ అవినీతిపై ఈడీకి ఫిర్యాదు ? స్వయంగా సోదరుడే

టీడీపీలో కలకలం. స్వయంగా పార్టీకి చెందిన ఓ తొలిసారి ఎంపీ (TDP MP) అవినీతిపై స్వయంగా ఆయన సోదరుడే ఈడీకి ఇవాళ ఫిర్యాదు చేశారు. ఇందులో సదరు ఎంపీ ఎక్కడెక్కడ అవినీతి చేస్తున్నారో పూర్తిగా ఆధారాలతో సహా

కేశినేని చిన్ని ఓ చార్లెస్ శోభరాజ్
Sakshi8 Jun 2026
కేశినేని చిన్ని ఓ చార్లెస్ శోభరాజ్

సాక్షి,కృష్ణా: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై కేశినేని నాని విమర్శలు గుప్పించారు. చిన్నిని ‘చార్లెస్‌ శోభరాజ్‌’తో పోల్చారు. ఎంపీ చిన్ని రోజూ రూ.కోటి అవినీతి సోమ్మును తింటున్నాడు. నీ సిబ్బంది ఆ

డ్యాన్స్ తో అదరగొట్టిన బాలయ్య చిన్న కూతురు.. వీడియో వైరల్
AP7AM29 May 2026
డ్యాన్స్ తో అదరగొట్టిన బాలయ్య చిన్న కూతురు.. వీడియో వైరల్

నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తన డ్యాన్స్ టాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ పాటకు ఆమె వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్