టాక్సిక్ లేడీస్ అండ్ లేడీస్ టీజర్
Actor ProfileActor

టాక్సిక్ లేడీస్ అండ్ లేడీస్ టీజర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాక్సిక్ లేడీస్ అండ్ లేడీస్ టీజర్ పై సెటైర్లు... సెన్సార్ అయ్యాక మిగిలేది 30 నిమిషాల సినిమానేనా
Zee Telugu31 Aug 2026
టాక్సిక్ లేడీస్ అండ్ లేడీస్ టీజర్ పై సెటైర్లు... సెన్సార్ అయ్యాక మిగిలేది 30 నిమిషాల సినిమానేనా

Toxic Ladies and Ladies:యశ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుకుంది. కేజీఎఫ్-2 తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రతి అప్‌డేట్‌పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల చిత్రబృందం విడుదల చేసిన 'లేడీస్ అండ్ లేడీస్' టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ టీజర్ పేరు చూసి సినిమాలోని మహిళా పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చాలా మంది భావించారు. కానీ టీజర్ విడుదలైన తర్వాత మాత్రం చాలా మంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్లు ఉన్నప్పటికీ వారి పాత్రలను చాలా తక్కువగా చూపించారని, ఎక్కువ భాగం యశ్‌పైనే దృష్టి పెట్టారని కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి ప్రముఖ నటీమణులు నటిస్తున్నారు. ఇంత పెద్ద తారాగణం ఉన్నా టీజర్‌లో వారికి పెద్దగా ప్రాధాన్యం కనిపించలేదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు మహిళా పాత్రలకు ఒక్క డైలాగ్ కూడా ఇవ్వకుండా టీజర్ ముగించడాన్ని విమర్శిస్తున్నారు. మరికొందరు టీజర్‌ను సరదాగా ట్రోల్ చేస్తూ ఇది సినిమా టీజర్ కంటే ఒక ప్రకటనలా అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు టీజర్ చివర్లో వినిపించిన ఒక డైలాగ్‌పై కూడా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పదాల వాడకం అవసరమా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు విడుదలైన టీజర్ చూసి చాలామంది ఈ సినిమాకి సెన్సార్ అయిన తర్వాత కనీసం 30 నిమిషాల సినిమా అయినా మిగులుతుందా అని అడుగుతున్నారు. ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మహిళా దర్శకురాలు అయినప్పటికీ మహిళా పాత్రలను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే టీజర్ మాత్రమే చూసి