టాక్సిక్ ని పక్కన పెట్టిన యశ్ .. నెక్ట్స్ మూవీ ఇదే
Actor ProfileActor

టాక్సిక్ ని పక్కన పెట్టిన యశ్ .. నెక్ట్స్ మూవీ ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాక్సిక్ ని పక్కన పెట్టిన యశ్ .. నెక్ట్స్ మూవీ ఇదే, స్టోరీ లీక్.. సెన్సేషనల్ హీరోయిన్
Asianet News Telugu23 Aug 2026
టాక్సిక్ ని పక్కన పెట్టిన యశ్ .. నెక్ట్స్ మూవీ ఇదే, స్టోరీ లీక్.. సెన్సేషనల్ హీరోయిన్

KGF సిరీస్ తర్వాత యశ్ తర్వాతి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యశ్ ప్రస్తుతం 'టాక్సిక్' మూవీ చేస్తున్నాడు. ఇది చిత్రీకరణ పూర్తయ్యింది. రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఎప్పుడో సమ్మర్‌లో రావాల్సిన ఈ మూవీ ఇంకా రిలీజ్‌ కాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియడం లేదు. యుద్ధం కారణంగా వాయిదా వేసినట్టు చిత్ర వర్గాలు చెప్పాయి. కానీ రిలీజ్‌ పై క్లారిటీ లేదు. దీంతో ఇప్పుడు యశ్‌ `టాక్సిక్‌`ని పక్కన పెట్టాడు. కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్‌ పెడుతున్నాడు. నర్తన్‌ దర్శకత్వంలో యశ్‌ ఈ మూవీ చేస్తున్నాడని సమాచారం. ఇందులో `యానిమల్‌` ఫేమ్‌ డిమ్రి తృప్తి హీరోయిన్‌గా నటిస్తుందట. ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా కథ ఒక మాజీ సైనికుడి చుట్టూ తిరుగుతుందట. హీరో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సైన్యాన్ని వదిలేసి, తన సొంత ప్రాంతంలో పోలీస్ ఫోర్స్‌లో చేరతాడు. ఈ భారీ బడ్జెట్ సినిమాను బాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ 'ధర్మ ప్రొడక్షన్స్' నిర్మిస్తోంది. కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా ఉన్నారు. 'సప్త సాగరదాచె ఎల్లో' ఫేమ్ హేమంత్ ఎం. రావు, యశ్ కలిసి ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. నర్తన్ పవర్‌ఫుల్ డైరెక్షన్, యశ్ మ్యానరిజం కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు