టాక్సిక్ నుంచి రేపు మ రో స్పెష ల్ టీజ ర్
Actor ProfileActor

టాక్సిక్ నుంచి రేపు మ రో స్పెష ల్ టీజ ర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాక్సిక్ నుంచి రేపు మ రో స్పెష ల్ టీజ ర్
Telugu Times25 Aug 2026
టాక్సిక్ నుంచి రేపు మ రో స్పెష ల్ టీజ ర్

రాకింగ్ స్టార్ యష్(Yash) హీరోగా, గీతూ మోహన్‌దాస్(Geethu mohandas) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా టాక్సిక్(Toxic) ఈ ఏడాది అత్యంత ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిచిం ది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో మేకర్స్ మరో కీలక అప్డేట్‌తో అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచారు. గతంలో ప్రకటించినట్లుగానే ఈ సినిమాకు సంబంధించిన మహిళా పాత్రలపై ప్రత్యేకంగా రూపొందించిన టీజర్‌ను జూలై 1న ఉదయం 11:33 గంటలకు విడుదల చేయనున్నట్లు యష్ స్వయంగా వెల్లడించారు. దీంతో ఈ స్పెషల్ గ్లింప్స్‌లో ఏమి చూపించబోతున్నారన్న ఆసక్తి సోషల్ మీడియాలో మరింత పెరిగింది. ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani), రుక్మిణి వసంత్(Rukmini Vasanth), నయనతార(Nayanthara), హుమా ఖురేషి(Huma Qureshi), తారా సుతారియా(Tara Sutaria) వంటి ప్రముఖ నటీమణులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి పాత్రల చుట్టూనే ఈ ప్రత్యేక టీజర్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. యష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో మహిళా పాత్రలకు కూడా కథలో సమాన ప్రాధాన్యం ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ గ్లింప్స్ సినిమాపై మరింత క్లారిటీ ఇవ్వడంతో పాటు అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లే అవకాశముంది. కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ(K Venkata narayana)తో కలిసి యష్ తన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ రవి బస్రూర్‌(Ravi Basrur)తో పాటు మరికొందరు కంపోజర్లు కూడా ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న టాక్సిక్ ఆగస్టు 26, 2026న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్‌లో కూడా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం రేపు విడుదలయ్యే మహిళా పాత్రల టీజర్‌పై సినీ అభిమానుల దృష్టి అంతా కేంద్రీకృతమైంది