
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తొలుత ఇది సాధారణ మరణంగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ, బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ ఉదంతాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భార్య మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్న భర్త సౌమ్య శ్రీచరణ్‌పై ముస్సోరీ పోలీసులు తాజాగా హత్య కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా మామిడిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సుధాకర్, సత్యవతి దంపతుల ఏకైక కుమార్తె రాధాగాయత్రికి, విశాఖపట్నంకు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ శ్రీచరణ్‌తో గతేడాది నవంబర్ 8వ తేదీన ఘనంగా వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల దంపతులిద్దరూ ముస్సోరీ-ధనౌల్తీ రోడ్డులోని ఒక హోమ్‌స్టేకు వెళ్లారు. అక్కడ జూన్ 15వ తేదీ ఉదయం రాధాగాయత్రి నిర్జీవంగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు హోటల్ గదిలో రక్తపు మరకలతో కూడిన దుప్పట్లు, ఖాళీ మద్యపు సీసాలు లభ్యమవడం పలు అనుమానాలకు తావిచ్చింది. తన భార్య ముక్కు, నోటి నుంచి రక్తం రావడంతో స్పృహ తప్పిందని, తామిద్దరం రాత్రి మద్యం సేవించి పడుకున్నామని శ్రీచరణ్ పోలీసులకు ప్రాథమిక సమాచారం ఇచ్చాడు. అయితే హోటల్ యాజమాన్యం మాత్రం తమ ప్రాంగణంలో ఆల్కహాల్ అనుమతించబోమని స్పష్టం చేయడంతో శ్రీచరణ్ కథనాల్లోని అసత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కుమార్తె హఠాన్మరణంతో కన్నీరుమున్నీరవుతున్న తండ్రి సుధాకర్ శనివారం ముస్సోరీ పోలీసులను ఆశ్రయించి 11 ముఖ్యమైన అంశాలతో కూడిన సుదీర్ఘ ఫిర్యాదును అందజేశారు. తన అల్లుడు శ్రీచరణ్ తీవ్రమైన మానసిక వైకల్యంతో (సైకోలా) ప్రవర్తించేవాడని, నిరంతరం గాయత్రిని వేధింపులకు గురిచేసేవాడని పేర్కొన్నారు. అతడి పెట్టే టార్చర్ భరించలేకనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని, ఇది ముమ్మాటికీ ప్రణాళికాబద్ధంగా చేసిన హత్యేనని వాపోయారు. బాధిత