టీఎన్ సీసీ కొత్త అధ్యక్షుడిగా మాణికం ఠాకూర్
Actor ProfilePolitician

టీఎన్ సీసీ కొత్త అధ్యక్షుడిగా మాణికం ఠాకూర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టీఎన్ సీసీ కొత్త అధ్యక్షుడిగా మాణికం ఠాకూర్
AP7AM4 Aug 2026
టీఎన్ సీసీ కొత్త అధ్యక్షుడిగా మాణికం ఠాకూర్

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) నూతన అధ్యక్షుడిగా విరుదునగర్ లోక్‌సభ ఎంపీ బి. మాణికం ఠాకూర్‌ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నియమించింది. 2024 ఫిబ్రవరి నుంచి ఈ పదవిలో కొనసాగుతున్న కె. సెల్వపెరుంతగై స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తును మరింత బలోపేతం చేసే వ్యూహంలో భాగంగానే ఈ నియామకం జరిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సెల్వపెరుంతగై డీఎంకే పట్ల సానుకూల ధోరణితో ఉన్నారనే అభిప్రాయం పార్టీలో ఉండగా, మాణికం ఠాకూర్ ఆది నుంచి టీవీకేతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నారు. డీఎంకేతో పొత్తును ఆయన గతంలో బహిరంగంగానే వ్యతిరేకించారు.ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, 27 స్థానాల్లో బరిలోకి దిగి కేవలం 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్, అధికార టీవీకేతో జతకట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులను కూడా దక్కించుకుంది. ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ విప్‌గా వ్యవహరిస్తున్న మాణికం ఠాగూర్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.తాజా నియామకం పట్ల, టీవీకే మద్దతుతో రాజ్యసభ ఎంపీ అయిన ప్రవీణ్ చక్రవర్తి హర్షం వ్యక్తం చేశారు. మాణికం ఠాకూర్ నాయకత్వంలో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ