టీఎంసీ రెబల్స్ ఊహించని ట్విస్ట్.. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీతో విలీనం ప్రకటన
Actor ProfilePolitician

టీఎంసీ రెబల్స్ ఊహించని ట్విస్ట్.. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీతో విలీనం ప్రకటన

Total News1
Movie Updates0
Sources1
టీఎంసీ రెబల్స్ ఊహించని ట్విస్ట్.. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీతో విలీనం ప్రకటన
Andhra Jyothy14 Jun 2026
టీఎంసీ రెబల్స్ ఊహించని ట్విస్ట్.. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీతో విలీనం ప్రకటన

తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సుమారు 20 మంది టీఎంసీ రెంబల్ ఎంపీలు త్రిపురకు చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ‌తో విలీనమవుతున్నట్టు ప్రకటించారు. న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సుమారు 20 మంది టీఎంసీ రెంబల్ ఎంపీలు త్రిపురకు చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ‌ (Nationalist citizens party) తో విలీనమవుతున్నట్టు ప్రకటించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆదివారంనాడు కలిసి ఈ మేరకు లేఖ అందించారు. అనంతరం తాము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీతో విలీనం అవుతున్నట్టు ప్రకటించారు. టీఎంసీ రెబల్ గ్రూప్‌నకు సారథ్యం వహించిన కకోలి ఘోష్ దస్తిదార్ మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటులో తాము వేరుగా కూర్చుంటామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పారు. 'మాకు మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంది. మేము ఎన్డీయేలో భాగంగా ఉంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తాం' అని కకోల్ ఘోష్ దస్తిదార్ తెలిపారు. కాగా ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి వేటు పడకుండా తప్పించుకునేందుకు టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు