ఝార్ఖండ్ లో కాంగ్రెస్ షాక్.. క్రాస్ ఓటింగ్ తో పరిమళ్ నత్వానీ గెలుపు
Actor ProfilePolitician

ఝార్ఖండ్ లో కాంగ్రెస్ షాక్.. క్రాస్ ఓటింగ్ తో పరిమళ్ నత్వానీ గెలుపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఝార్ఖండ్ లో కాంగ్రెస్ షాక్.. క్రాస్ ఓటింగ్ తో పరిమళ్ నత్వానీ గెలుపు
Samayam Telugu18 Jun 2026
ఝార్ఖండ్ లో కాంగ్రెస్ షాక్.. క్రాస్ ఓటింగ్ తో పరిమళ్ నత్వానీ గెలుపు

ఝార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పరిమళ్ నత్వానీ గెలుపొందారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన సీపీఐ (ఎంఎల్), ఆర్జేడీలు క్రాస్ ఓటింగ్‌‌కు పాల్పడ్డాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మొత్తం రెండు రాజ్యసభ సీట్లకు గానూ అధికార జేఎంఎం నుంచి పోటీచేసిన బైజనాథ్ రామ్‌ గెలుచుకున్నారు. ఆయనకు మొత్తం 30 ఓట్లు వచ్చాయి. మరో స్థానం కోసం కాంగ్రెస్ నుంచి ప్రణవ్ ఝా, ఇండిపెండెంట్‌గా నత్వానీ పోటీపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థికి 20, నత్వానీకి 28 ఓట్లు వచ్చాయి. రెండు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ సహా మూడు ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఫలితాలపై కాంగ్రెస్ మంత్రి దీపికా పాండే స్పందిస్తూ ద్రోహం జరిగిందని ఆరోపించారు. దీనికి విరుద్ధంగా, బీజేపీకి చెందిన కోడెర్మా ఎమ్మెల్యే నీరా యాదవ్ ‘జై శ్రీ రామ్.. పని పూర్తయ్యింది’ అని అన్నారు. మొత్తం 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో అవసరమైన కనీసం 28 మొదటి ప్రాధాన్యత ఓట్లకు 24 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నాలుగు ఓట్ల దూరంలో ఉంది. జేఎంఎం, కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమికి 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సంఖ్యతో రెండు స్థానాలను అధికార కూటమి సులువుగా గెలుచుకోవచ్చు.సొంతంగా ఒక సీటు గెలుచుకోవడానికి తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దించడంతో హోరాహోరీ పోరు నెలకొంది. చివరకు క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ అభ్యర్థిని దెబ్బకొట్టి, స్వతంత్రంగా పోటీచేసి ఎన్డీయే మద్దతుతో పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. దీంతో వరుసగా ఆయన రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2020లో ఏపీ నుంచి ఆయన రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అధికార, ప్రతిపక్షాలు పోలింగ్‌కు ముందు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి క్యాంపులకు తరలించాయి. ఎన్‌డిఎ ఎమ్మెల్యేలను మంగళవారం రాంచీలోని హోటల్‌కు తరలించారు. ఇండియా కూటమి క్రాస్ ఓటింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేసింది. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి