జనసేన నేత కిషోర్ గునుకులను కలిసిన టీచర్స్.. పవన్ కళ్యాణ్ దృష్టికి
Actor ProfilePolitician

జనసేన నేత కిషోర్ గునుకులను కలిసిన టీచర్స్.. పవన్ కళ్యాణ్ దృష్టికి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జనసేన నేత కిషోర్ గునుకులను కలిసిన టీచర్స్.. పవన్ కళ్యాణ్ దృష్టికి
HMTV19 Jun 2026
జనసేన నేత కిషోర్ గునుకులను కలిసిన టీచర్స్.. పవన్ కళ్యాణ్ దృష్టికి

Nellore: జనసేన నేత కిషోర్ గునుకులను కలిసిన టీచర్స్.. పవన్ కళ్యాణ్ దృష్టికి! నెల్లూరు: గత15 సంవత్సరాలుగా గిరిజన విద్యాభివృద్ధికి సేవలందించిన ఉపాధ్యాయుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఆదుకోవాలని కూటమికి అర్జీ సమర్పించారు, ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ (TREI) అవుట్‌సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. బ్రమ్మయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.వి. రమణయ్య మరియు సభ్యులు... జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకులను వారి నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను వివరిస్తూ.. గత 15 సంవత్సరాలుగా గిరిజన గురుకుల పాఠశాలల్లో అత్యంత అంకితభావంతో సేవలందిస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా వ్యాప్తి కోసం ఎన్నో కష్టనష్టాలు భరిస్తూ, విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించడం నుంచి వారి సంక్షేమం వరకు బాధ్యతగా వ్యవహరించామని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత, సంక్షేమం కోసం ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే విధులకు చేరుకుని, సాయంత్రం మాత్రమే కాకుండా అవసరమైతే రాత్రి సమయాల్లో కూడా హాస్టళ్లలో విద్యార్థులతోనే గడుపుతూ ఇద్దరు ఉపాధ్యాయులు నిరంతరం అందుబాటులో ఉండేవారమని తెలిపారు. విద్యార్థులను తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ సేవలందించినప్పటికీ, నేడు ఉద్యోగ భద్రత లేక నిరాదరణకు గురవుతున్నామన్న ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నెలకు కేవలం రూ.5 వేల వేతనంతో ఉద్యోగాల్లో చేరిన తాము, ప్రభుత్వ విద్యా వ్యవస్థను నమ్ముకొని ఇన్నేళ్లు కొనసాగామని తెలిపారు. ఇదే సమయంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసి ఉంటే అడ్మిషన్ల ఆధారంగా అదనపు ప్రోత్సాహకాలు, మెరుగైన వేతనాలు, పదోన్నతులు పొందే అవకాశాలు ఉండేవని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకంతో గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేసిన తమకు ఇప్పుడు న్యాయం చేయాలని కోరారు. గతంలో డీఎస్సీ అర్హత నిబంధనల కారణంగా 1,446 మంది అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులను తొలగించిన సమయంలో కూటమి నాయకులను ఆశ్రయించగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో, అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి