
జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలు తప్పులు దొర్లాయి. పార్టీ కోసం కష్టపడిన నిజమైన


జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలు తప్పులు దొర్లాయి. పార్టీ కోసం కష్టపడిన నిజమైన

జనసేన పార్టీలో సంస్థాగత మార్పులకు, భవిష్యత్ వ్యూహాలకు అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. కేవలం ఎన్నికల వేళ మాత్రమే కాకుండా.. క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసి, సాధారణ కార్యకర్తలను సైతం రేపటి తరం నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఒక భారీ కార్యాచరణను ప్రకటించారు. తన స్వీయ పర్యవేక్షణలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను నియమిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ట్విట్టర్ (X) ద్వారా వెల్లడించారు. 2014 నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ పార్టీ జెండాను భుజాన మోసిన అసలైన జనసైనికులకు గుర్తింపునిచ్చేలా ఈ కమిటీలు పని చేయనున్నాయి.పార్లమెంట్ నుంచి విలేజ్ స్థాయి వరకు.. పక్కా స్కెచ్!పార్టీ నిర్మాణంలో ఎలాంటి పక్షపాతం లేకుండా, కేవలం ప్రతిభ, అంకితభావానికే పెద్దపీట వేసేలా పవన్ కల్యాణ్ ఈ కమిటీల నిర్మాణాన్ని డిజైన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించడమే ఈ కమిటీల ప్రధాన ఉద్దేశం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం ముగ్గురు సాధక్స్ (సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొన్నవారు) చొప్పున, ఒక సీనియర్ పరిశీలకుడు, స్థానిక అంశాలపై పట్టున్న ముగ్గురు సీనియర్ నాయకులతో కూడిన 28 మంది సభ్యుల భారీ కమిటీ ప్రతి లోక్‌సభ స్థానంలో పనిచేస్తుంది. వీరికి సహాయంగా కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక సిబ్బంది కూడా ఉంటారు.ఎవరు ఏ బాధ్యతకు అర్హులు? అభ్యర్థుల నుంచి దరఖాస్తులుఈ సరికొత్త ప్రక్రియలో భాగంగా, తొలి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఏ కార్యకర్త ఏ స్థాయిలో బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు? ఎవరికి ఏ విభాగంలో పట్టు ఉంది? అనే వివరాలను సేకరించేందుకు 25 పార్లమెంట్ స్థానాలకు ఒక్కో పరిశీలకుడిని నియమించారు. పార్లమెంట్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీలో పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నవారి సమాచారాన్ని వీరు సేకరిస్తారు. ఆ తర్వాతే.. నేరుగా