జననాయగన్’ నిర్మాతకు కీలక పదవి ఇచ్చిన సీఎం విజ య్ .. తమిళనాట రాజకీయ దుమారం
Actor ProfilePolitician

జననాయగన్’ నిర్మాతకు కీలక పదవి ఇచ్చిన సీఎం విజ య్ .. తమిళనాట రాజకీయ దుమారం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జననాయగన్’ నిర్మాతకు కీలక పదవి ఇచ్చిన సీఎం విజ య్ .. తమిళనాట రాజకీయ దుమారం
AP7AM30 Jul 2026
జననాయగన్’ నిర్మాతకు కీలక పదవి ఇచ్చిన సీఎం విజ య్ .. తమిళనాట రాజకీయ దుమారం

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి విజయ్ నటించిన‌ ‘జననాయగన్’ చిత్ర నిర్మాత కె. వెంకట నారాయణను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నియామకంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వెంకట నారాయణ ఈ పదవిలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగుతారు. ఆయన నియామకానికి సంబంధించిన ఇతర నిబంధనలు, షరతులను త్వరలో వెల్లడిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై హెచ్. వినోద్ దర్శకత్వంలో ‘జననాయగన్’ చిత్రాన్ని వెంకట నారాయణ నిర్మించారు. ముఖ్యమంత్రి విజయ్‌తో వెంకట నారాయణకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఈ నియామకం వివాదాస్పదంగా మారింది. గత మే నెలలో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆర్.వి. అర్లేకర్‌ను కలిసినప్పుడు కూడా వెంకట నారాయణ ఆయన వెంటే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ‘జననాయగన్’ చిత్రం కూడా ఇటీవల వార్తల్లో నిలిచింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి) నుంచి అనుమతులు ఆలస్యం కావడం, విడుదలకు ముందే సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం వంటి సమస్యలను ఈ చిత్రం ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికీ ఈ మూవీ విడుద‌ల ఇంకా సందిగ్ధంలోనే ఉంది. నియామకంపై డీఎంకే తీవ్ర అభ్యంతరంఈ నియామకాన్ని ప్రతిపక్ష డీఎంకే తీవ్రంగా తప్పుపట్టింది. డీఎంకే రాజ్యసభ ఎంపీ పి. విల్సన్ మాట్లాడుతూ.. ఒక సినిమా నిర్మాతను కీలకమైన