
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Jangaon Tragedy Toddler Drowns In Water Sump: ఒకే ఇంట్లో ఒకే రోజు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. జనగామ జిల్లా కేంద్రంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘోరం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకున్న రెండు ఏళ్ల చిన్నారి, ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న నీటి సంపులో పడి మృతి చెందగా, ఆ విషయం తెలియగానే ఆమె నానమ్మ గుండెపోటుతో కుప్పకూలిపోయింది. నిన్న అంబేద్కర్ నగర్‌లో జరిగిన ఈ హృదయ విదారక ఘటనతో ఆ గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది. పోలీసుల సమాచారం ప్రకారం, జనగాం జిల్లాలోని అంబేద్కర్ నగర్‌లో నివసించే ఈ కుటుంబానికి చెందిన ఆరు నెలల పసిపాప ప్రియాన్షు ఆడుకుంటోంది. అందరూ పాప ఆడుకుంటుంది కదా.. అనుకున్నారు. కానీ, అనుకోని ఘోరమే జరిగింది.. అందరి కళ్ళు గప్పి తెరిచి ఉన్న నీటి సంపు వద్దకు వెళ్ళింది పాప. దీన్ని వెంటనే కుటుంబ సభ్యులు గమనించలేదు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదవశాత్తు పాప ఉన్నట్టుండి ఆ నీటి సంపులో పడిపోయింది. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత కాసేపటి పాప కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వెతక సాగారు.. ఎంతకీ పాప ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చి వెంటనే ఇంట్లో ఉన్న నీటి సంపు తెరచి చూశారు. సంపులో చిన్నారి తేలుతూ కనిపించింది. వెంటనే పాపను బయటకు తీసి ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆ చిన్నారి ప్రాణం పోయిందని వైద్యులు ధ్రువీకరించారు. కళ్ల ముందే ఆడుకుంటున్న చిన్నారి ఇలా నీటి సంపులో పడి మరణించడంతో ఇల్లంతా దుఃఖంతో నిండిపోయింది. మరోవైపు, మనవరాలి మృతదేహాన్ని