జగన్ .. లోకేశ్ సవాల్ ను స్వీకరించి చర్చకు రండి
Actor ProfilePolitician

జగన్ .. లోకేశ్ సవాల్ ను స్వీకరించి చర్చకు రండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జగన్ .. లోకేశ్ సవాల్ ను స్వీకరించి చర్చకు రండి
Eenadu17 Jun 2026
జగన్ .. లోకేశ్ సవాల్ ను స్వీకరించి చర్చకు రండి

అమరావతి: డీఎస్సీపై మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) విసిరిన సవాల్‌ను జగన్‌ (YS Jagan) స్వీకరించి చర్చకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) డిమాండ్‌ చేశారు. వాస్తవాలు, ఆధారాలతో ఆయన ఆరోపణలను తిప్పికొడతామని చెప్పారు. డైవర్షన్‌ రాజకీయాల కోసమే డీఎస్సీపై జగన్‌ అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రొయ్యల ఫీడ్‌ ధరలు వైకాపా హయాంలో ఎంత మేరకు పెరిగాయనే అంశంపైనా చర్చకు తాను సిద్ధమని అచ్చెన్న సవాల్‌ విసిరారు. మంత్రి అనితను రాజకీయంగా ఎదుర్కోలేకే వైకాపా నాటకాలాడుతోందన్నారు. వెన్నుపోటుకు కర్త, కర్మ, క్రియ జగనేనని విమర్శించారు. ‘‘వాస్తవాలు, ఆధారాలతో జగన్‌ ప్రతి అసత్య ఆరోపణనూ సమర్థంగా తిప్పికొడతాం. రొయ్యల ఫీడ్‌ కంపెనీలను కులం ఆపాదించడం సిగ్గుచేటు. తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారనే విజ్ఞత మరిచి గొడ్డలి పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రానికి.. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని పదవి కోసం కాంగ్రెస్‌ పార్టీకి.. ఆస్తి కోసం తల్లి, చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచారు. మద్య నిషేధం సహా అన్ని హామీలు విస్మరించిన జగన్‌కు కూటమి మ్యానిఫెస్టో గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. పన్నిన కుట్రలు సాగకపోవడంతో కులాల మధ్య గొడవలు పెట్టేందుకు సిద్ధమయ్యారు’’ అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైకాపా నేత నల్లపరెడ్డి