జగన్ త్వరలో జైలుకు వెళ్ళటం ఖాయం
Actor ProfilePolitician

జగన్ త్వరలో జైలుకు వెళ్ళటం ఖాయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జగన్ త్వరలో జైలుకు వెళ్ళటం ఖాయం
Telugu Times1 Aug 2026
జగన్ త్వరలో జైలుకు వెళ్ళటం ఖాయం

గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో త్వరలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) జైలుకెళ్లడం ఖాయమని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నాసికరం మద్యాన్ని ఏరులై పారించి సుమారు 30 వేల మందిని జే గ్యాంగ్ బలిగొందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు ముందుకు వెళుతున్న కొద్దీ పుష్ప సినిమా (Pushpa movie)ను మించిన స్మగ్లింగ్ కథలు బయటకొస్తున్నాయి. మద్యం కుంభకోణంలో సంపాదించిన అక్రమ సొమ్మును మామిడి కాయల బాక్సుల్లో పెట్టి ప్రతి నియోజకవర్గానికి తరలించారు. వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి (Mithun Reddy), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ తదితరులు రూ.3,500 కోట్లకు పైగా దోచుకున్నారు అని మండిపడ్డారు