జులై సెకండ్ వీకెండ్ లో బాక్సాఫీస్ వార్ లో నెగ్గేదెవ రు
Actor ProfileActor

జులై సెకండ్ వీకెండ్ లో బాక్సాఫీస్ వార్ లో నెగ్గేదెవ రు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జులై సెకండ్ వీకెండ్ లో బాక్సాఫీస్ వార్ లో నెగ్గేదెవ రు
Telugu Times9 Aug 2026
జులై సెకండ్ వీకెండ్ లో బాక్సాఫీస్ వార్ లో నెగ్గేదెవ రు

జులై సెకండ్ వీకెండ్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొనబోతోంది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ(Jayakrishna) నటించిన శ్రీనివాస మంగాపురం(Srinivasa mangapuram) జులై 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా, అక్కినేని అఖిల్(Akkineni Akhil) కమ్‌బ్యాక్ మూవీగా ప్రచారం పొందుతున్న లెనిన్(lenin) జులై 10న థియేటర్లలోకి రానుంది. వరుసగా రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ రెండు సినిమాలు స్టార్ కుటుంబాలకు చెందిన హీరోల సినిమాలు కావడంతో పాటు భారీ నిర్మాణ సంస్థల మద్దతుతో వస్తుండటంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అజయ్ భూపతి(Ajay bhupathi) దర్శకత్వం వహించిన శ్రీనివాస మంగాపురం గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, వినోదం ప్రధానంగా తెరకెక్కిన సినిమాగా చెబుతున్నారు. ర‌షా తదానీ(Rasha Tadani) హీరోయిన్‌గా నటించగా, మోహన్ బాబు(mohan babu) కీలక పాత్రలో కనిపించనున్నారు. సి. అశ్వినీదత్‌(C. Aswinidutt)కు చెందిన వైజయంతి మూవీస్(Vyjayanthi movies), జెమినీ కిరణ్(Gemini Kiran) కలిసి ఈ సినిమాను నిర్మించారు. జయకృష్ణకు మద్దతుగా సూపర్‌స్టార్ మహేష్ బాబు(mahesh babu) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరుకానుండటం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. జివి ప్రకాష్ కుమార్(GV Prakash kumar) సంగీతం అందించారు. మరోవైపు మురళి కిషోర్ అబ్బూరు(murali kishore abburu) దర్శకత్వంలో రూపొందిన లెనిన్ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భాగ్యశ్రీ బోర్సే(bhagya sri borse) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios), సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara Entertainments) సంయుక్తంగా నిర్మించాయి. త‌మన్(Thaman) సంగీతం అందించిన ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు నాగార్జున(Nagarjuna), నాగచైతన్య(Naga Chaitanya) రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే రిలీజైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో జులై సెకండ్ వీకెండ్‌లో ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది