
జూలూరుపాడు, జూన్ 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కన ఇప్పుడు చెత్తా చెదారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. జూలూరుపాడు మండల కేంద్రంలోని వెంగన్నపాలెం ప్రధాన రహదారి పక్కన, ఏకంగా పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలను తలపిస్తూ అనధికారిక డంపింగ్ యార్డ్‌గా మారాయి. పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లోపం, కొందరు వ్యాపారుల నిర్లక్ష్యం వెరసి స్థానికులకు, ప్రయాణికులకు తీవ్ర అవస్థలు తెచ్చిపెడుతున్నాయి. గతంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న పొలానికి చెందిన రైతులు మట్టి కోసం తీసిన భారీ గుంత ఇప్పుడు స్థానిక వ్యాపారులకు వ్యర్థాలు పారబోసే అడ్డాగా మారింది. రాత్రి వేళల్లో కొందరు వ్యాపారులు, హోటల్ యజమానులు, కొబ్బరి బొండాలు విక్రయించేవారు, జ్యూస్ పాయింట్ల నిర్వాహకులు తడి, పొడి చెత్తను ప్లాస్టిక్ కవర్లలో తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా ఇక్కడ పారబోస్తున్నారు. ఈ తడి చెత్త, ఇతర వ్యర్థాలు మురిగిపోయి ఆ దారిన వెళ్లే ప్రయాణికులకు ముక్కుపుటలదిరే దుర్గంధం వెదజల్లుతోంది. ఈ ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటేనే ప్రజలు ముక్కు మూసుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ పాలనలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హరితహారం' కార్యక్రమంలో భాగంగా రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి పెద్ద వృక్షాలుగా మారాయి. కానీ ఆ చెట్ల మధ్య ఉన్న పచ్చని ఆహ్లాదకరమైన స్థలాలు ఇప్పుడు కొబ్బరి బోండాలు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలకు నిలయంగా మారాయి. పోలీస్ స్టేషన్ సమీపంలోని డివైడర్ నుండి మొదలుకుని సాయిబాబా దేవాలయం వరకు రహదారికి ఇరువైపులా ఎటు చూసినా ఈ చెత్తాచెదారమే దర్శనమిస్తుండడం గమనార్హం. ఒకవైపు వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ చెత్తాచెదారం స్థానికులకు మరింత ప్రాణ సంకటంగా మారనుంది. పారిశుధ్యం పూర్తిగా లోపించడంతో ఈ ప్రాంతమంతా ఇప్పటికే దోమల స్వైర విహారానికి అడ్డాగా మారింది. దీనికి తోడు వానలు