జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.. చర్చించే అంశాలు ఇవే
Actor ProfilePolitician

జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.. చర్చించే అంశాలు ఇవే

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఇద్దరు మంత్రులు అవుట్? కేబినెట్ ప్రక్షాళన దిశగా విజయ్
Oneindia Telugu27 Aug 2026
ఇద్దరు మంత్రులు అవుట్? కేబినెట్ ప్రక్షాళన దిశగా విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకోవడంతో పాటు పాలనా వేగాన్ని

జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.. చర్చించే అంశాలు ఇవే
Oneindia Telugu24 Aug 2026
జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.. చర్చించే అంశాలు ఇవే

తెలంగాణ కేబినెట్ సమావేశం డేట్ ఫిక్స్ అయింది. జూలై 2 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం 6 వ అంతస్తులో ఈ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ భేటీ నేపథ్యంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు అజెండా రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేశాయి. ఈ సమావేశానికి సంబంధించిన అజెండా అంశాలను సర్క్యులేషన్‌ ద్వారా ఆమోదించి వాటిని తెలుగు అనువాదంతో సహా సాధారణ పరిపాలన శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు నివేదికలను జూలై 1 న మధ్యాహ్నం 1:00 గంటల కల్లా ఖచ్చితంగా పంపాలని సీఎస్ ఆదేశించారు. ఒకవేళ ఎలాంటి అజెండా అంశాలు లేకపోయినా నిల్ రిపోర్టును పంపాలని స్పష్టం చేశారు.కేబినెట్ సమావేశం ముగిసే వరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిలు, ప్రధాన కార్యదర్శులు ఖచ్చితంగా తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ప్రస్తుత రాజకీయ, పరిపాలనా పరమైన అంశాలు, అలగే పలు కీలక బిల్లులు, ప్రజా సంక్షేమ పథకాలపై ఈ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి