SBI Credit Card Changes : జులై ఒకటో తేదీ నుంచి పలు కీలక మార్పులు రాబోతున్నాయి. చాలా వరకు కొత్త ఆర్థికపర నిర్ణయాలు మీ జేబుకు చిల్లుపడేలా చేయొచ్చు. ఇక్కడ డెడ్ లైన్స్ ముగుస్తున్నాయి. క్రెడిట్ కార్డు రూల్స్ మారుతున్నాయి. ఇంకా ఆధార్ అప్డేట్, పాస్ పోర్ట్ ఫీజుల పెంపు వంటివి ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం.ITR 1, 2 గడువు2025-26 ఆర్థిక సంవత్సరం లేదా 2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ 1, 2 దాఖలు చేసే టాక్స్ పేయర్లకు గడువు జులై 31 గా ఉంది. ఈ గడువు దాటితే పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది. ఇంకా పన్ను చెల్లింపు దారులు ఇతర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.ఆధార్ అప్డేట్ ఫ్రీభారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. ఇక్కడ ఆధార్ కార్డులో రిజిస్టర్డ్ ఇ మెయిల్ అడ్రస్ అప్డేట్ చేసుకోవాలంటే సాధారణంగా రూ. 75 రుసుము ఉంది. కానీ జులై 1 నుంచి 6 నెలలపాటు దీనిని మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.SBI క్రెడిట్ కార్డు మార్పులుఎంపిక చేసిన ఫోన్ పే ఎస్బిఐ క్రెడిట్ కార్డుల్లో రివార్డ్ పాయింట్ ప్రోగ్రాంలో మార్పులు ప్రకటించింది. ఇది జులై 1 నుంచే అమల్లోకి వస్తుంది. ఇందులో భాగంగా రివార్డ్ పాయింట్లు పొందే వాటిపై పరిమితులు విధించింది.HDFC క్రెడిట్ కార్డ్ మార్పులు HDFC కూడా క్రెడిట్ కార్డు మార్పులు ప్రకటించింది. ఒక త్రైమాసికంలో కనీసం రూ. 60 వేలు స్పెండ్ చేస్తే, తదుపరి త్రైమాసికంలో 3 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ విజిట్స్ ఛాన్స్ ఉంటుంది. ఇది జులై ఒకటి నుంచే అమల్లోకి వస్తుంది.పాస్ పోర్ట్ ఫీజుల పెంపుభారతదేశంలో పాస్ పోర్ట్ ఫీజులు పెంచుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జులై 1 నుంచి సాధారణ, అలాగే తత్కాల్ పాస్పోర్ట్ కోసం అధిక సర్వీస్ ఛార్జీ వసూలు చేయనుంది.బ్యాంకులకు కొత్త
Actor ProfilePolitician
జులై 1 నుంచి కొత్త రూల్స్.. ఐటీఆర్ గడువు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•4 Aug 2026
జులై 1 నుంచి కొత్త రూల్స్.. ఐటీఆర్ గడువు, ఆధార్ కార్డ్ అప్డేట్, క్రెడిట్ కార్డ్ రూల్స్ సహా