
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Jio Best Plan:రూ.3,599 ప్లాన్‌లో వినియోగదారులకు 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులో ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ డేటా అందుబాటులో ఉంటుంది. మొత్తం ఏడాది కాలానికి 900GB కంటే ఎక్కువ డేటా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. రోజువారీ డేటా పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ సేవ కొనసాగుతుంది. అయితే స్పీడ్ తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. అలాగే రోజుకు 100 ఉచిత SMSలు కూడా పొందవచ్చు. డేటా, కాలింగ్‌తో పాటు వినోదం కోసం ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జియో హాట్‌స్టార్ మొబైల్, టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను మూడు నెలల పాటు ఉచితంగా అందిస్తున్నారు. అలాగే గూగుల్ జెమిని AI ప్రో సేవలను కూడా అదనపు ఛార్జీలు లేకుండా ఉపయోగించుకోవచ్చు. జియో టీవీ ద్వారా లైవ్ ఛానెల్స్, పలు టీవీ కార్యక్రమాలను వీక్షించే అవకాశం ఉంటుంది. జియో క్లౌడ్ సేవలతో అదనపు స్టోరేజ్ సౌకర్యం కూడా లభిస్తుంది. 5G సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉంటే అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా వినియోగించుకోవచ్చు. దీంతో ఎక్కువ డేటా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మరోవైపు రూ.3,999 ప్లాన్ కూడా 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 SMSలు వంటి ప్రయోజనాలు ఉంటాయి. జియో హాట్‌స్టార్, గూగుల్ జెమిని AI ప్రో, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు కూడా అందుబాటులో