జ్యోతికతో ప్రేమలో పడడానికి కారణం ఆ సినిమానే.. మొదటి సారి చెప్పిన హీరో సూర్య
Actor ProfileActor

జ్యోతికతో ప్రేమలో పడడానికి కారణం ఆ సినిమానే.. మొదటి సారి చెప్పిన హీరో సూర్య

Total News1
Movie Updates0
Sources1
జ్యోతికతో ప్రేమలో పడడానికి కారణం ఆ సినిమానే.. మొదటి సారి చెప్పిన హీరో సూర్య
TV9 Telugu13 Jun 2026
జ్యోతికతో ప్రేమలో పడడానికి కారణం ఆ సినిమానే.. మొదటి సారి చెప్పిన హీరో సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. గతంలో సూర్య ఓ తన అభిమానులకు తమ వ్యక్తిగత జీవితం, ప్రేమ ప్రయాణం, కుటుంబ విశేషాల గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు మరోసారి వైరలవుతున్నాయి.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ఇంటర్వ్యూలో సూర్య, జ్యోతికల అద్భుతమైన ప్రేమకథ, వారి కూతురు దియా గురించి చెప్పిన విషయాలు ఎంతో ఆకట్టుకున్నాయి. జ్యోతికతో తన తొలి పరిచయం 1999లో పూవెల్లం కెట్టుపార్ చిత్రం సెట్‌లో జరిగిందని సూర్య వెల్లడించారు. ఇది జ్యోతికకు మొదటి తమిళ చిత్రం కాగా, సూర్యకు నాల్గవది. దర్శకుడు వసంత్ వారిని ఒకరికొకరు పరిచయం చేశారని, వారి మొదటి షాట్ కూడా ఎంతో ప్రత్యేకమైనదని సూర్య గుర్తుచేసుకున్నారు. ఆ షాట్‌లో వారు చేతులు పట్టుకొని మార్చ్ పాస్ట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ రోజు చేతులు కలిసిన వారిద్దరు, ఇప్పుడు జీవితాంతం తోడుగా ఉన్నారని సంతోషంగా చెప్పారు. తమ జీవితాల్లో వసంత్ పాత్రకు ఎప్పటికీ కృతజ్ఞులమని, ఆయనే తమను కలిపారని సూర్య పేర్కొన్నారు. ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ.. వారి మధ్య ప్రేమ ఎలా మొదలైందని అడిగినప్పుడు, అది ఒక ప్రక్రియ అని, తాము ఎప్పుడు ప్రేమలో పడ్డామో ఖచ్చితంగా తెలియదని సూర్య అన్నారు. తమ మొదటి రెండు చిత్రాలలో తాము ఎక్కువగా మాట్లాడుకోలేదని, అప్పట్లో జ్యోతిక తనకంటే పెద్ద నటి అని, ఆమె చాలా విజయవంతమైందని సూర్య అన్నారు. ఆ తర్వాత రెండు, మూడు సంవత్సరాల గ్యాప్ వచ్చిందని, ఆ తర్వాత కాక కాక చిత్రం కోసం మళ్లీ కలిశామని చెప్పారు. ఈ చిత్ర సమయంలోనే వారి మధ్య స్నేహం మరింత బలపడి ప్రేమగా మారిందని సూర్య తెలిపారు. తాను జ్యోతికకు పెద్ద అభిమానినని, వారి