జైపూర్ లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
Actor ProfilePolitician

జైపూర్ లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే

Total News1
Movie Updates0
Sources1
జైపూర్ లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి
Vaartha15 Jun 2026
జైపూర్ లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి

Cockroach Janata Party: దేశవ్యాప్తంగా యువతలో సెన్సేషన్ సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దారుణ దాడి జరిగింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగం, అవినీతిపై ఆయన శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుండగా కొందరు గుర్తుతెలియని దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమంపై తీవ్ర స్థాయిలో రాజకీయ చర్చ నడుస్తున్న తరుణంలో, సాక్షాత్తూ ఈ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడిపైనే దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. Read also: Minister Rammohan Naidu:భూములిచ్చిన రైతులకు రాయల్ గౌరవం.. జేవార్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్ వారి కోసమే! ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైపూర్‌లో కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యువత నినాదాలు చేస్తుండగా, ఒక్కసారిగా కొందరు దుండగులు గుంపులోకి దూసుకొచ్చి ఆయనపై భౌతిక దాడికి దిగారు. ఊహించని ఈ పరిణామంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన తోటి నిరసనకారులు, యువకులు అభిజిత్‌ను కాపాడుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. సమాచారం అందుకున్న జైపూర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దాడికి గల అసలు కారణాలు ఏమిటి? దీని వెనుక ఏవైనా రాజకీయ శక్తుల హస్తం ఉందా? లేదా ముందస్తు ప్రణాళికతోనే ఈ కుట్ర జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను, సోషల్ మీడియా లైవ్ వీడియోలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. Sanchita Ugale Last Video: ఇన్‌స్టాగ్రామ్‌లో సంచిత ఉగాలే చివరి వీడియో.. అంతలోనే ఏం జరిగింది? గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Perfect Health : నిత్య యవ్వనం, నిండు ఆరోగ్యం: ఉదయాన్నే చేయాల్సిన