జాన్వీ వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు.. అనంత శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్
Actor ProfileCelebrity

జాన్వీ వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు.. అనంత శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్

Total News1
Movie Updates0
Sources1
జాన్వీ వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు.. అనంత శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్
10TV Telugu14 Jun 2026
జాన్వీ వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు.. అనంత శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్

Ananth Sriram : పెద్ది సినిమా మంచి హిట్ అయినా జాన్వీ కపూర్ పాత్రపై కొంతమంది విమర్శలు చేసారు. తన పాత్రని కేవలం అందాల ఆరబోతకే వాడారు అని, సె*క్సువలైజ్ చేసి తన పాత్రను చూపించారు అని పలువురు విమర్శలు చేసారు. దీనికి బుచ్చిబాబు మయోభవాలు దెబ్బతిన్నందుకు సారీ అని పబ్లిక్ గానే చెప్తూ ట్వీట్ చేసారు. తాజాగా పెద్ది సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో జాన్వీ వివాదం గురించి కూడా ప్రశ్నించగా బుచ్చిబాబు, లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ స్పందించారు. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. నాకు బుచ్చిబాబు గారు సారీ చెప్పడం నచ్చలేదు. ఒక పాత్ర ఒకలాగా ప్రవర్తిస్తుంది అనేది దర్శకుడి ఊహ. ఆ ఊహతో సినిమా చేస్తాడు. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడినాడు గొప్పోడు, PHD లు చేసిన వాళ్ళ ఆలోచన విధానమే సరైనది అనేది ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో ఎవరైతే మాట్లాడారో వాళ్ళ అభిప్రాయం రుద్దబడి ప్రభావితం అవ్వడం తప్ప ఒక దర్శకుడికి ఒక పాత్ర ఇలా ప్రవర్తిస్తుంది అనే స్వేచ్ఛ లేకపోతే సృజనాత్మకతకు మనం ఏం చేసినట్టు. వైటల్ అట్రాక్షన్, హార్మోనల్ రియాక్షన్ ఇలాంటి పెద్ద పదాలు సినిమాల్లో వాడితే చాలా ఈస్థటిక్ గా ఉంది సినిమా అంటారు. అదే ముట్టేస్తాను అని వాడి ట్రైబ్ భాష మాట్లాడితే ఇది వల్గారిటీ, ఆబ్జెక్ట్ఫికేషన్ అంటారు. ఇలా చేస్తే సృజనాత్మకత దెబ్బ తిన్నట్టే. బుచ్చిబాబుకి సంస్కారం ఉంది కాబట్టి సారి చెప్పారు. ఇదే కొనసాగితే డాక్యుమెంటరీలు తప్ప కమర్షియల్ సినిమాలు చేయలేమును. అసలు మొన్న మేము థియేటర్ కి వెళ్తే భర్తలతో వచ్చిన మహిళలు కూడా బుచ్చిబాబు దగ్గరకు వచ్చి మీరెందుకు సారీ చెప్పారు. మాకు ఏమి అనిపించలేదు. వేరే సినిమాల్లో ఇంతకంటే దారుణంగా ఉంది అన్నారు అని విమర్శలు చేసినవాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుచ్చిబాబు సాన కూడా దీనిపై మాట్లాడుతూ.. ఒక అయిదు శాతం