జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
Actor ProfilePolitician

జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
Telugu Times9 Jul 2026
జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా... ఇక జొన్నగిరి రూ.405 కోట్లతో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ పెట్టుబడి ఏడాదికి 400 కేజీలు, 900 కేజీలు, 2 టన్నులు-దశల వారీగా పెరగనున్న బంగారం వెలికితీత ఉత్పత్తి అయిన బంగారం విలువలో రాష్ట్ర ఖజానాకు 4 శాతం రాయల్టీ విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కూ శంకుస్థాపన అమరావతి, జూన్ 23:- బంగారు నిక్షేపాల గని అంటే కర్నాటక రాష్ట్రంలోని కేజీఎఫ్ గుర్తొచ్చేది... కానీ ఇప్పుడు ఆ స్థానంలో జొన్నగిరి పేరు మారుమోగనుంది. కరవు కేకలు వినిపించిన ఒకప్పటి కర్నూలు జిల్లా ఇక బంగారం ఉత్పత్తికి ప్రధాన వేదిక కానుంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఏర్పాటైంది. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌కు ప్రభుత్వం 1,500 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం మొదటి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు జరగనున్నాయి. దీనికి తగినట్టుగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. రెండో దశలో మిగిలిన ప్రాంతంలోనూ ప్లాంట్ విస్తరించున్నారు. ప్రస్తుతం ఏర్పాటైన ఈ ప్లాంట్ ద్వారా తొలి ఏడాదికి 400 కిలోల పసిడిని ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి 900 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తారు. ఈ రకంగా ఏ ఏడాదికి ఆ ఏడాది ఉత్పత్తి పెరుగుతూ... ఏడాదికి 2 టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేయనున్నారు. ఈ మేరకు ప్లాంట్ సామర్థ్యాన్ని ప్రాసెసింగ్ కెపాసిటీని విస్తరించనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా 700 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక ఉత్పత్తి చేసిన బంగారం ధరలో 4 శాతం రాష్ట్రానికి రాయల్టీగా వస్తుంది. మొదట తీసే 400 కేజీలకు రూ.57 కోట్లు, 900 కేజీలకు రూ.144 కోట్ల వరకూ రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రానుంది. ప్రారంభోత్సవం... శంకుస్థాపన కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అనంతరం ప్లాంట్ విస్తరణలో