జెన్ జీ యాక్ససరీస్ కీ ఓ లెక్కుంది
Actor ProfileActor

జెన్ జీ యాక్ససరీస్ కీ ఓ లెక్కుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జెన్ జీ యాక్ససరీస్ కీ ఓ లెక్కుంది
Andhra Jyothy5 Aug 2026
జెన్ జీ యాక్ససరీస్ కీ ఓ లెక్కుంది

కాలానికి తగినట్టు ఫ్యాషన్లు మారుతుంటాయి. నేటి జెన్‌ జీకి యాక్ససరీలంటే మహా సరదా. వాళ్లు ధరించే దుస్తులే కాదు... ఫోన్‌ కేసులు, నీళ్ల బాటిల్స్‌ ఆఖరికి రబ్బరు బాండ్లు కూడా భిన్నంగా ఉంటాయి. ప్రతీ స్టయిల్‌లో వాళ్ల అభిరుచి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వారికి నచ్చేట్టు ఆయా ఉత్పత్తుల్లో కొత్తదనాన్ని తెస్తున్నారు ఉత్పత్తిదారులు. ప్రస్తుతం జెన్‌ జీ వినియోగిస్తున్న ట్రెండీ యాక్ససరీలను డీకోడ్‌ చేద్దాం... అమ్మమ్మల కాలం... దట్టంగా నూనె రాసుకుని రిబ్బన్లతో రెండు జడలు అల్లుకుని, చేతిలో రెండు పుస్తకాలతో కాలేజీకి వెళ్లేవాళ్లు. అమ్మల కాలం... పోనీటెయిల్‌కి రబ్బరు బ్యాండ్‌ వేసుకుని, పుస్తకాలబ్యాగుతో, అంచెలంచెల టిఫిన్‌ బాక్స్‌తో కాలేజీకి వెళ్లేవాళ్లు. ప్రస్తుతం జెన్‌ జీ అమ్మాయిలు, రంగు రంగుల బ్యాగు, పెద్ద వాటర్‌ టంబ్లర్‌, రకరకాల అలంకరణల ఫోను, మణికట్టుకు వెల్వెట్‌ రబ్బరు బ్యాండ్‌తో కాలేజీకి వెళుతున్నారు. అబ్బాయిల స్టయిల్స్‌ కూడా మారిపోతున్నాయి. బాటిలే ఓ ట్రోఫీ... జెన్‌ జీ స్టయిల్‌లో కామన్‌గా కనపడేది పేద్ద వాటర్‌ టంబ్లర్‌. ఒకేసారి లీటర్‌ - లీటరున్నర నీళ్ల టంబ్లర్‌ని చేతిలో పట్టుకుని కనిపిస్తారు. హాల్‌ లోంచి బాల్కనీలోకి వచ్చినా, జిమ్‌కు వెళ్లినా, కాలేజీకి వెళ్లినా వాళ్లతో బాటు ఈ టంబ్లర్‌ ఉండాల్సిందే. ఏదో ఆటలో గెలుచుకున్న ట్రోఫీని మోస్తున్నంత సంబరంగా దాన్ని క్యారీ చేస్తుంటారు. మునుపెన్నడూ లేనంతగా ఇప్పటి యువత నీళ్లకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. అయితే, ఈ నీళ్ల బాటిల్‌ దగ్గరే ఉంది పెద్ద కథ. మామూలు స్టీల్‌, గాజు, ప్లాస్టిక్‌ బాటిలే అనుకోవడానికి లేదు. పదార్థాలు అవే అయినా రకరకాల డిజైన్లు, ట్రెండీ బొమ్మల ప్రింట్లు, రంగులు... అదనంగా స్ట్రా కూడా దీనికి ఉంటుంది. ఎలుగుబంటి, పాండా లాంటి జంతువులు, పండ్లు, కూరగాయల అచ్చులతో భలే క్రేజీగా ఉంటాయి ఈ టంబ్లర్లు. కొన్నింటికి 3డీ స్టిక్కర్లు కూడా. చాలామంది తమ ఔట్‌ఫిట్‌కు మ్యాచ్‌ అయ్యే వాటినే ఎంచుకోవడం విశేషం. ఇక