జూన్ 18 నుండి తెలంగాణాలో భారీవర్షాలు
Actor ProfileCelebrity

జూన్ 18 నుండి తెలంగాణాలో భారీవర్షాలు

Total News1
Movie Updates0
Sources1
జూన్ 18 నుండి తెలంగాణాలో భారీవర్షాలు
Oneindia Telugu15 Jun 2026
జూన్ 18 నుండి తెలంగాణాలో భారీవర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ వర్షాలు వ్యవసాయ రంగానికి మంచి ఊతం ఇవ్వవచ్చని భావిస్తున్నారు.ఈ జిల్లాలలో భారీ వర్షాలువాతావరణ శాఖ అంచనాల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 5 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. 15, 16, 17 తేదీల్లో ఉత్తర మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఇది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఇంకా కొన్ని జిల్లాలకు చేరని నైరుతి రుతుపవనాలునైరుతి రుతుపవనాలు ఈ నెల 8వ తేదీన తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ, వాటి కదలిక నెమ్మదిగా సాగుతోంది. 11వ తేదీ నాటికి హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలకు విస్తరించాయి. అయితే రాష్ట్రమంతా పూర్తిగా వ్యాపించడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఇంకా పవనాలు పూర్తిగా చేరుకోలేదు. దీంతో ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోంది.ఈ జిల్లాలలో తీవ్రంగా ఎండలుఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, ములుగు, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో అనేక మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే వర్షాలు ఉష్ణోగ్రతలను తగ్గించి, వాతావరణాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంతో పాటు వ్యవసాయానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు.విద్యార్థులకు భారీ శుభవార్త.. తొలిసారి కాలేజ్ స్టూడెంట్స్ కు సైతం బ్రాండెడ్