జీతభత్యాల వివరాలు అందించండి.. కేంద్ర శాఖలకు 8వ పే కమిషన్ డెడ్ లైన్
Actor ProfilePolitician

జీతభత్యాల వివరాలు అందించండి.. కేంద్ర శాఖలకు 8వ పే కమిషన్ డెడ్ లైన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జీతభత్యాల వివరాలు అందించండి.. కేంద్ర శాఖలకు 8వ పే కమిషన్ డెడ్ లైన్
AP7AM21 Aug 2026
జీతభత్యాల వివరాలు అందించండి.. కేంద్ర శాఖలకు 8వ పే కమిషన్ డెడ్ లైన్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి 8వ వేతన సంఘం (8th Pay Commission) తన కార్యకలాపాలను కీలక దశకు చేర్చింది. ఉద్యోగుల జీతాలు, అలవెన్సులపై సిఫార్సులు చేసేందుకు ముందుగా.. ప్రభుత్వం ప్రస్తుతం ఎంత ఖర్చు చేస్తోందో స్పష్టమైన అంచనాకు రావాలని కమిషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంస్థలు తమ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆన్‌లైన్ డేటా పోర్టల్‌లో సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.ఈ సమాచారాన్ని అప్‌లోడ్ చేయడానికి జూన్ 30 తుది గడువుగా నిర్ణయించినట్లు 8వ పే కమిషన్ అప్‌డేట్స్‌ను పంచుకునే ఒక పోర్టల్ పేర్కొంది. ఈ ప్రక్రియలో వందలాది ప్రభుత్వ కార్యాలయాలు, భారీ ఆర్థిక డేటా ఇమిడి ఉన్నందున, అన్ని సంస్థలు గడువులోగా ఈ పని పూర్తి చేస్తాయా? లేదా? కమిషన్ మరింత సమయం ఇస్తుందా అనేది వేచి చూడాలి.ఆన్‌లైన్‌లోనే సమర్పించాలిసమాచారమంతా తప్పనిసరిగా తమ అధికారిక ఆన్‌లైన్ డేటా పోర్టల్ ద్వారానే సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్ పద్ధతిలో ఎలాంటి వివరాలను స్వీకరించబోమని స్ప‌ష్టం చేసింది. అంటే.. మంత్రిత్వ శాఖలు భౌతిక ఫైళ్లు, ఎక్సెల్ షీట్లు, ప్రింటెడ్ డాక్యుమెంట్లు లేదా ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని పంపడానికి వీల్లేదు. కేవలం ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సిఫార్సుల రూపకల్పన కోసం ఒకే డిజిటల్ డేటాబేస్‌ను రూపొందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.కోరిన వివరాలు ఇవే..నివేదికల ప్రకారం.. గత మూడు పూర్తి ఆర్థిక