
నెలంతా ఆఫీసులో కష్టపడి పనిచేశాక, ఒకటో తారీఖున బ్యాంక్ అకౌంట్‌లో జీతం క్రెడిట్ అయిన మెసేజ్ చూడగానే వచ్చే ఆనందం వేరు. కానీ, ఆ కిక్ ఎన్నాళ్లు ఉంటుంది? చాలా మందికి వారం తిరిగే సరికి సగం జీతం మాయం అయిపోతుంది. నెల చివర వచ్చేసరికి జేబు పూర్తిగా ఖాళీ అవుతుంది. ఈ పరిస్థితి మారాలంటే, జీతం పడిన వెంటనే కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులు చేయాలి. ఈ రోజుల్లో మనీ మేనేజ్‌మెంట్ పక్కాగా తెలిసి ఉండాలి. జీతం పడగానే మీరు కచ్చితంగా చేయాల్సిన ఆ 8 ముఖ్యమైన పనులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. జీతం అకౌంట్‌లో పడగానే ముందుగా కనీసం 10% నుంచి 20% మొత్తాన్ని సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం పక్కన పెట్టేయండి. 'ఖర్చు చేయగా మిగిలిన దాన్ని సేవ్ చేయడం కాదు.. ముందు సేవ్ చేసి మిగిలిన దాన్ని మాత్రమే ఖర్చు చేయాలి' అనేది ఇక్కడ అసలైన సూత్రం. సంపదను నిర్మించుకోవడానికి ఇది తొలి అడుగు లాంటిది. అలాగే కేవలం ఒకే జీతం మీద ఆధారపడటం ఈ రోజుల్లో రిస్క్. సైడ్ బిజినెస్, ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ ప్రొడక్ట్స్ లేదా మంచి ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా సెకండ్ ఇన్‌కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మీ రెగ్యులర్ ఆదాయం ఆగిపోయినా మీ లైఫ్ స్టైల్‌కు ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. సాలరీ రాగానే ముందుగా చేయాల్సిన మరో ముఖ్యమైన పని బిల్స్ క్లియర్ చేయడం. కరెంట్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, ఇంటి అద్దె, ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు లాంటివి ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే కట్టేయండి. ఇలా చేయడం వల్ల లేట్ ఫీజుల భారం తప్పుతుంది. మీ సిబిల్ స్కోర్ కూడా దెబ్బతినకుండా సేఫ్‌గా ఉంటుంది. దీనివల్ల నెలంతా ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా ఉండొచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్ అప్పులు, పర్సనల్ లోన్స్, బై నౌ పే