
అది కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పరిధిలోని సీహెచ్ అగ్రహారం. పచ్చని పామాయిల్ తోటలు, ప్రశాంతమైన వాతావరణం. కానీ, గత తొమ్మిది రోజులుగా అక్కడ భయానక నిశ్శబ్దం అలుముకుంది. తోట కాపలాదారులుగా పనిచేసే సుంకర గణేష్, భవాని దంపతుల ముద్దుల కూతురు, రెండేళ్ల పసికందు జ్ఞానేశ్వరి (జానూ) ఈ నెల 6వ తేదీన అదృశ్యమైంది. రోజులు గడుస్తున్నా ఆ పాప ఏమైందో ఎవరికీ తెలియదు. అసలు ఆ చిన్నారిని ఎవరో అపహరించారా? లేక దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందా? అనే ప్రశ్నలు మిస్టరీగా మారిన తరుణంలో, ఈ కేసులోకి ఊహించని ఒక బిగ్ ట్విస్ట్ వచ్చి చేరింది.క్లూ ఇవ్వాల్సిన విశ్వాసపాత్రురాలు.. శవమై తేలింది!ఈ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆ పామాయిల్ తోటలోనే ఉండే ఒక పెంపుడు కుక్క అత్యంత కీలకంగా మారింది. సాధారణంగా ఆ చిన్నారి ఎక్కడికి వెళ్లినా నీడలా వెంట నడిచే ఆ కుక్క.. పాప అదృశ్యమైన రోజు నుంచి తోట పరిసరాల్లో వింతగా ప్రవర్తించడం ప్రారంభించింది. అది ఖచ్చితంగా పోలీసులకు ఏదో ఒక క్లూ ఇస్తుందని భావిస్తున్న తరుణంలో.. శనివారం ఉదయం ఆ పెంపుడు కుక్క అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించింది.కేసును చేధించడంలో కీలకమైన కుక్క అకస్మాత్తుగా చనిపోవడం వెనుక పెద్ద కుట్రే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాప ఆచూకీ దొరకకుండా చేయడానికే ఎవరైనా దానికి విషం పెట్టారా? లేక మరేదైనా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఆ కుక్కకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఆ నివేదిక వస్తే గానీ ఈ మరణం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడదు.రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్.. జల్లెడ పడుతున్న 400 మంది సిబ్బంది!చిన్నారి అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు. పాప ఆచూకీ కోసం కేవలం పోలీసులు