చనిపోయి ఎక్కడున్నాడో మహానుభావుడు..! తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు
Actor ProfileActor

చనిపోయి ఎక్కడున్నాడో మహానుభావుడు..! తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు

Total News1
Movie Updates0
Sources1
చనిపోయి ఎక్కడున్నాడో మహానుభావుడు..! తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు
TV9 Telugu14 Jun 2026
చనిపోయి ఎక్కడున్నాడో మహానుభావుడు..! తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు

ప్రముఖ నటుడు ఉత్తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించేవారు ఉత్తేజ్. ఈ మధ్యకాలంలో ఉత్తేజ్ సినిమాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో దివంగత హాస్యనటుడు వేణు మాధవ్ గొప్ప మనసును, అరుదైన మానవతా దృక్పథాన్ని పంచుకున్నారు. సినీ పరిశ్రమలో మనుషులు ఎలా ఉంటారు అనేదానికి ఒక ఉదాహరణగా వేణు మాధవ్ కు సంబంధించిన ఒక సంఘటనను ఆయన వివరించారు. ఒకసారి వేణు మాధవ్ ఒక సినిమా షూటింగ్‌లో ఉండగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఒక తోటి నటుడు ఆయనను కలిశాడట. సినిమాల్లో బిజీగా ఉన్న వేణు మాధవ్‌ను రెండు సీన్లు ఇవ్వమని, అలాగే ఏదైనా ఆర్థిక సహాయం చేయమని ఆ నటుడు కోరాడట. తన కుటుంబం చాలా కష్టాల్లో ఉందని చెప్పుకొని బాధపడ్డాడట ఆ నటుడు. ఇది కూడా చదవండి : Jabardasth Vinod: జబర్దస్త్ లేకపోతే ఆ పని చేసేవాడిని.. అసలు విషయం చెప్పిన లేడీ గెటప్ వినోద్ అయితే వేణు మాధవ్ ముందుగా అతనికి లంచ్ ఏర్పాటు చేసి, భోజనం చేయమని చెప్పారట. లంచ్ బ్రేక్ తర్వాత, ఆ నటుడి పరిస్థితి గురించి ఉత్తేజ్‌తో ఆరా తీశారు. హైదరాబాద్ లోని గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉంటాడని, ఎంతో కొంత సాయం కోరుతున్నాడని ఉత్తేజ్ చెప్పగా, వేణు మాధవ్ సాయం చేస్తానని మాట ఇచ్చి షూటింగ్ చేసుకున్నాడట.. అయితే ఆ నటుడు వేణు మాధవ్ నుంచి డబ్బు సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత, వేణు మాధవ్ ఉత్తేజ్‌ను పిలిచి తన ఇన్నోవా కారు వెనుక డోర్ తెరిచి చూపించారట. ఆసమయంలో ఉత్తేజ్ ఆశ్చర్యపోయారు. ఆ కారు నిండా రెండు బస్తాల బియ్యం, పది కిలోల కందిపప్పు, పది కిలోల పెసరపప్పు, అలాగే అల్లం, వెల్లుల్లి, ఉప్పు వంటి