చీరలో పుత్తడి బొమ్మలా నటి సమంత.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
Actor ProfileActor

చీరలో పుత్తడి బొమ్మలా నటి సమంత.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

Total News1
Movie Updates0
Sources1
చీరలో పుత్తడి బొమ్మలా నటి సమంత.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
Zee Telugu15 Jun 2026
చీరలో పుత్తడి బొమ్మలా నటి సమంత.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

Heroine Samantha: సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.. పర్సనల్ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొందనే చెప్పాలి. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత గతేడాది డిసెంబర్‌లో రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుంది సమంత. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా చీరలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ సమంత.. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు నిర్మాతగానూ రాణిస్తోంది. సామ్ హీరోయిన్‌గా నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి ఆమె భర్త రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు సహ నిర్మాతగా వ్యవహరించారు. రజనీకాంత్ క్లాసిక్ హిట్ ‘బాషా’ తరహాలోనే.. ఒక సీక్రెట్ ఫ్లాష్‌బ్యాక్ ఉన్న ఒక సాధారణ మధ్యతరగతి గృహిణి పాత్రలో సమంత ఇందులో నటించారు. దర్శకురాలు నందిని రెడ్డితో ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత సమంత కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సమంత ఎలాంటి డూప్ సహాయం తీసుకోకుండా, కేవలం చీరకట్టులోనే భీకరమైన యాక్షన్ సీన్లు చేయడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 20 నిమిషాల పక్కా రన్‌టైమ్‌తో సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు చేసిన సమంత.. మొదటిసారి పూర్తి స్థాయి యాక్షన్ కామెడీ జోనర్‌లో చేస్తుండటం, పైగా ప్రమోషన్ల కోసం ఈ స్థాయిలో కష్టపడుతుండటంతో ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్