చిరంజీవి విలన్ అవుతాడని కృష్ణంరాజు అంటే.. ఇండస్ట్రీకి మొగుడు’ అవుతాడని చెప్పా
Actor ProfileActor

చిరంజీవి విలన్ అవుతాడని కృష్ణంరాజు అంటే.. ఇండస్ట్రీకి మొగుడు’ అవుతాడని చెప్పా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిరంజీవి విలన్ అవుతాడని కృష్ణంరాజు అంటే.. ఇండస్ట్రీకి మొగుడు’ అవుతాడని చెప్పా
Samayam Telugu22 Aug 2026
చిరంజీవి విలన్ అవుతాడని కృష్ణంరాజు అంటే.. ఇండస్ట్రీకి మొగుడు’ అవుతాడని చెప్పా

సీనియర్ నటుడు మాగంటి మురళీ మోహన్‌ గత ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ‘జగమే మాయ’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన ఆయన.. ఇప్పటివరకూ 350కి పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాకుండా 'జయభేరి ఆర్ట్స్' అనే బ్యానర్ స్థాపించి, నిర్మాతగానూ రాణించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 'పద్మశ్రీ' అవార్డును అందజేసింది. ఈ నేపథ్యంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో సన్మానం నిర్వహించింది. ఈ సందర్భంగా మురళీ మోహన్‌ ఆయన తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ''నా జీవితం ఒక తెల్లకాగితం. దానిపై ఎక్కడా ఒక మచ్చ పడలేదు. ఇకపై కూడా పడనివ్వను'' అని మురళీ మోహన్ అన్నారు. పద్మశ్రీ అవార్డు ఆలస్యంగా వచ్చినప్పటికీ, లేటేస్ట్‌గా వచ్చిందని భావిస్తున్నానన్నారు. ''నేను ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో తెలియకపోవచ్చు. ఏది ఏమైనా ఆలస్యంగా వచ్చినా నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. నాకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపుకు చాలా సంతోషంగా ఉన్నాను'' అని మురళీ మోహన్ అన్నారు. తన అసలు పేరు రాజాబాబు అని, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ‘మురళీ మోహన్’గా మారిందని తెలిపారు. ఆ పేరే తనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని, ఇదంతా నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు పెట్టిన బిక్ష అని ఆయన అన్నారు.* మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌కు ‘పద్మశ్రీ’ ప్రదానం.. జీవితంలో తాను నిజాయితీని మాత్రమే నమ్ముకున్నానని, ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ముందుకు సాగానని, తన జీవితాన్ని మలిచిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోనని మురళీ మోహన్ పేర్కొన్నారు. హీరోగా తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత పూర్ణచంద్రరావు, తన సినీ ప్రయాణానికి అండగా నిలిచిన దర్శకుడు దాసరి నారాయణరావు, ఆర్థిక విషయాలపై సలహాలు ఇచ్చిన నటుడు శోభన్ బాబు, అలాగే తన జీవితాన్ని ప్రభావితం చేసిన గుప్త మాణిక్యాలరావులను మురళీ మోహన్ ఈ