చిరంజీవి మూవీతో ఎంట్రీ
Actor ProfileActor

చిరంజీవి మూవీతో ఎంట్రీ

Total News1
Movie Updates0
Sources1
చిరంజీవి మూవీతో ఎంట్రీ, సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నటి.. ఇప్పుడు ముంబైలో టాప్ లాయర్
Asianet News Telugu13 Jun 2026
చిరంజీవి మూవీతో ఎంట్రీ, సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నటి.. ఇప్పుడు ముంబైలో టాప్ లాయర్

తమిళ సినిమా 'సిల్లును ఒరు కాదల్' (2006) తెలుగులో 'నువ్వంటే నాకిష్టం'గా డబ్ అయ్యింది. ఈ సినిమాలో సూర్య, జ్యోతికల కూతురిగా శ్రియా శర్మ నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే, ఆమె కెరీర్ మొదలైంది తెలుగులోనే. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'జై చిరంజీవ'లో ఆయన చెల్లి కూతురిగా నటించి శ్రియా తన ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ ‘రోబో’, మహేష్ బాబు దూకుడు వంటి భారీ చిత్రాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించింది. అంతేకాదు, దాదాపు 150కి పైగా టీవీ యాడ్స్‌లో నటించి అప్పట్లో అందరికీ సుపరిచితమైన ముఖంగా మారింది. శ్రియా శర్మ సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు చూసిన అభిమానులు, "మనం చూసిన ఆ చిన్న పాప ఈమెనా? ఎంత పెద్దదైపోయిందో!" అని ఆశ్చర్యపోతున్నారు. తన లాయర్ వృత్తికి సంబంధించిన అందమైన క్షణాలను కూడా అభిమానులతో పంచుకుంటోంది. ఒకప్పుడు కెమెరా ముందు నటించిన ఆ చిన్నారి, ఇప్పుడు కోర్టులో వాదిస్తోంది. సినిమానే జీవితం కాదు, ఇతర రంగాల్లోనూ రాణించవచ్చని శ్రియా శర్మ నిరూపించింది. ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం